Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.!
కిడ్నీలో ఒక్కసారి రాళ్లు ఏర్పడ్డాక ఆ సమస్య నుంచి బయటపడటం అంత సులభం కాదు. అందుకే కిడ్నీలో రాళ్లు తొలగించాక మళ్లీ పెరగకుండా ఉండటానికి మీరు తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారనేది యూరాలజిస్టులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. అయితే చాలా మంది పండ్లు ఎక్కువగా తీసుకుంటుంటారు. మరి ఈ సమస్యతో ఉన్నవారి ఏ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.. ఏం సలహాలు ఇస్తున్నారు.. ఇక్కడ చూద్దాం..

శరీరంలో ఆక్సలేట్స్ స్థాయిలు పెరిగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువ. కొందరిలో ఒక్కసారి కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాక వాటిని తొలగించినా మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటాయి. శరీరంలోని వ్యర్థాలు మూత్రపిండాల బయటకు వెళ్లాక.. అదనంగా ఉన్న ఆక్సలేట్ కాల్షియంతో రసాయనిక చర్య జరిపి స్ఫటికాలుగా మారి క్రమంగా రాళ్లుగా మారతాయి.
అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంగా యూరాలజిస్టులు చెబుతున్నారు. ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అతిగా తీసుకోవడం, సరిపడా నీరు తాగకపోవడం, కాల్షియం తక్కువగా తీసుకోవడం, పరిమితికి మించిన మోతాదులో విటమిన్ సి సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో జన్యులోపాలు కూడా కారణం కావచ్చని వెల్లడిస్తున్నారు.
లక్షణాలు ఇవే..
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినప్పుడు అవి మూత్రనాళంలో కదిలి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. నడుము భాగం లేదా పొత్తికడుపుకి ఇరువైపులా భరించలేని నొప్పిని అనుభవిస్తారు. మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంట రావడం, యూరిన్ ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులోకి మారడం, పలు సందర్భాల్లో రక్తం పడటం వంటివి జరుగుతాయి. కొందరిలో వికారం, వాంతులు, జ్వరం రోగాలతో సతమతమవుతుంటారు.
ఈ క్రమంలో కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగా పండ్లు తీసుకుంటుంటారు. అయితే కొన్ని పండ్లలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుందని.. మరికొన్ని పండ్లలో ఆక్సలేట్ తక్కువగా ఉంటుందని యూరాలజిస్ట్‌లు చెబుతున్నారు. మరి వాటిలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది.. ఎలాంటి పండ్లు తీసుకోవాలి.. వేటికి దూరంగా ఉండాలో సలహా ఇస్తున్నారు.
జామపండ్లు- ఒక మీడియం సైజు జామ పండులో 83మి.గ్రా ఆక్సలేట్లు ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే మూత్రపిండాల సమస్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అందుకే జామ పండ్లను అప్పుడప్పుడూ మాత్రమే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. జామపండుకి యూరాలజిస్టు ఇచ్చే రేటింగ్- 3/10
కివీ పండ్లలో ఆక్సలేట్లు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇది రాళ్ల సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకే అప్పుడప్పుడూ మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. రేటింగ్ 4/10. దానిమ్మ పండ్లలో కివీకి మించి ఆక్సలేట్లు ఉంటాయని యూరాలజిస్టులు పేర్కొన్నారు. వీటిని చాలా తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. రేటింగ్ 2/10.

పుచ్చకాయ- పుచ్చకాయలో నీరు 92 శాతం ఉంటుంది. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు పుచ్చకాయను సమృద్ధిగా తినవచ్చు. యూరాలజిస్టు రేటింగ్- 9/10
నిమ్మకాయ- కిడ్నీ స్టోన్స్ సమస్యకి నిమ్మకాయ ఓ సంజీవనిలా పనిచేస్తుంది. ఇందులో సిట్రేట్ అధికంగా ఉన్న కారణంగా ఈ పేషెంట్లకి ఇది బెస్ట్ ఫ్రూట్ అని సూచిస్తున్నారు. తరచుగా నిమ్మరసం తాగడం వల్ల ఆక్సలేట్ పరిమాణం తగ్గుతుంది. రేటింగ్- 10/10
ఆరెంజ్ పండ్లలో సిట్రేట్ పుష్కలంగా ఉంటుంది. ఆక్సలేట్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. రేటింగ్- 8/10. యాపిల్ పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఆక్సలేట్లు తక్కువగా ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ బాధితులు తరచుగా యాపిల్‌ను తినవచ్చు. రేటింగ్ 7/10
అరటిపండులో తక్కువ స్థాయిలో ఆక్సలేట్లు ఉన్న కారణంగా రోగులు వీటిని తరచూ తీసుకోవచ్చు. ఇందులో పొటాషియం అధికంగా ఉన్న కారణంగా మూత్రంలో కాల్షియం స్థాయిలను తగ్గిస్తుంది. రేటింగ్ 7/10.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications