Latest Updates
-
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా!
వాకింగ్ చేస్తున్నా కూడా బరువు పెరుగుతున్నారంటే కారణం ఇదే!
నడిస్తే ఆరోగ్యానికి మంచిది, నడిచే అలవాటు ఉన్నోళ్లు అనారోగ్యాల బారిన పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అని తరుచుగా మనం వింటుంటాం. ఆరోగ్యంగా జీవించడానికి, దీర్ఘాయుష్షుతో ఉండటానికి మన ముందున్న సులభమైన, అద్భుతమైన మార్గం నడక. ఎలాంటి ఖర్చు లేకుండా మన శరీరాన్ని, మనసును ఉత్తేజపరిచే ఈ వ్యాయామాన్ని లక్షలాది మంది తమ దినచర్యలో భాగం చేసుకున్నారు. అయితే రోజూ గంట లేదా అంతకంటే ఎక్కువ సేపు నడిచే వారిలో చాలామంది ఒక ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తున్నారు. అదే నడకకు తగ్గ పోషకాహారం తీసుకోకపోవడం.
కేవలం నడవడం వల్లే ఆరోగ్యం మెరుగుపడదు. దానికి సరైన ఆహారం కూడా తోడవ్వాలి. పోషకాల కొరత వల్ల ఎంతో కష్టపడి నడిచినా ఆశించిన ఫలితాలు రాకపోగా కొన్నిసార్లు కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కండరాల సాంద్రత తగ్గిపోవడం, శరీర భంగిమలో మార్పులు రావడం, నీరసంగా అనిపించడం వంటివి దీనికి సంకేతాలు. ఆశ్చర్యకరంగా, కొందరిలో అధికంగా నడవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి కూడా పోషకాహార లోపమే కారణం. కాబట్టి మీ నడక ప్రయాణాన్ని మరింత ఫలవంతం చేసుకోవడానికి మూడు కీలక పోషకాలపై దృష్టి పెట్టండి.

ప్రోటీన్..కండరాల బలానికి పునాది
నడక మన గుండెకు, కాళ్లకు బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. కానీ ఈ ప్రక్రియలో కండరాలు వాడకం వల్ల కొంత అరుగుదలకు గురవుతాయి. వాటిని తిరిగి నిర్మించుకోవడానికి, బలోపేతం చేయడానికి ప్రోటీన్ అత్యంత అవసరం. మన ఆహారంలో తగినంత ప్రోటీన్ లేనప్పుడు శరీరం శక్తి కోసం కండరాలనే వాడటం మొదలుపెడుతుంది. ఫలితంగా కండరాల సాంద్రత తగ్గి, శరీరం ఆకృతి మారుతుంది.
ఏం చేయాలి?: క్రమం తప్పకుండా నడిచేవారు తమ ఆహారంలో కనీసం 25-30 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, పన్నీర్, పప్పుధాన్యాలు, శనగలు, సోయా, చేపలు, చికెన్ వంటివి మీ భోజనంలో భాగం చేసుకోండి.
ఉప్పు.. శక్తిని నియంత్రించే కీలక ఖనిజం
నడుస్తున్నప్పుడు మన శరీరానికి విపరీతంగా చెమట పడుతుంది. ఈ చెమట ద్వారా కేవలం నీరే కాదు, సోడియం వంటి ముఖ్యమైన లవణాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. శరీరంలో సోడియం లెవల్స్ తగ్గినప్పుడు, మెదడు ఉప్పగా ఉండే ఆహారాల కోసం సంకేతాలు పంపుతుంది. ఈ కోరికతో మనం చిప్స్, ఫ్రైస్ వంటి అనారోగ్యకరమైన, అధిక కేలరీలు ఉన్న ఆహారం వైపు మొగ్గు చూపుతాం. ఇది పొట్ట కొవ్వు పెరగడానికి దారితీస్తుంది.
ఏం చేయాలి?: ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగడం ఉత్తమమైన మార్గం. ఇది శరీరానికి కోల్పోయిన సోడియంను తిరిగి అందించి, అనవసరమైన కోరికలను నియంత్రిస్తుంది.

నీరు..శరీరానికి జీవనాధారం
చెమట ద్వారా శరీరం నీటిని కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్ కు గురవుతుంది. డీహైడ్రేషన్ నేరుగా కండరాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. కండరాలు బలహీనపడతాయి, ఎనర్జీ లెవల్స్ పడిపోతాయి. దీనివల్ల నడక త్వరగా అలసటగా అనిపిస్తుంది.
ఏం చేయాలి?: కేవలం నడక తర్వాతే కాకుండా రోజంతా క్రమం తప్పకుండా తగినంత నీరు తాగుతూ ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications