Latest Updates
-
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
ఖాళీ కడుపుతో వాకింగ్ చేయాలా? తిన్న తర్వాత వాకింగ్ చేయాలా? బరువు తగ్గడానికి బెస్ట్ ఇదే
వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనం వింటుంటాం. వాకింగ్ చేయడం వల్ల క్యాలరీలు కరుగుతాయని, ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటుగా జీవక్రియను పెంచడానికే కాకుండా బరువు తగ్గించే ప్రయత్నంలో ఉన్నవాళ్లకి కూడా వాకింగ్ చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే కొంతమంది మంచిగా తిన్న తర్వాత వాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు..మరికొందరు ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తుంటారు.
అయితే బరువు తగ్గానికి ఏ వాకింగ్ అత్యంత ప్రభావవంతమైనది? ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం మంచిదా? తిన్న తర్వాత వాకింగ్ చేయడం మంచిదా? అనే ప్రశ్న తరచుగా చాలామందిలో తలెత్తుతుంది. ఆరోగ్య నిపుణులు ఈ ప్రశ్నకు చెప్పిన సమాధానం ఏంటో ఇక్కడ చూడండి.

బరువు తగ్గాలనుకుంటే ఇలా చేయండి
ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం మంచిదని, దీనిని ఫాస్టింగ్ కార్డియో అని కూడా అంటారని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో నడవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే..ఖాళీ కడుపుతో నడిచినప్పుడు శరీరం శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును ఉపయోగించాల్సి వస్తుందని,ఇది కొవ్వును కరిగించడానికి, బరువు తగ్గడానికి దారితీస్తుందని తెలిపారు. వాకింగ్ లేదా వ్యాయామం చేసే సమయంలో కండరాలు రక్తం నుండి చక్కెరను సంకోచం కోసం తీసుకుంటాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయినప్పుడు..కండరాలకు ఇంధనంగా కాలేయం గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా విచ్ఛిన్నం చేస్తుంది. నిద్రలో కూడా కాలేయం రక్తప్రవాహంలోకి గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. అందువల్ల ఉదయం శరీరంలో గ్లైకోజెన్ నిల్వలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఉపవాసం ఉన్న స్థితిలో వ్యాయామం చేయడం వల్ల శరీరం శక్తి కోసం ఎక్కువ కొవ్వును కరిగిస్తుందని తెలిపారు. నాటింగ్‌హామ్ ట్రెంట్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 2022లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఖాళీ కడుపుతో నడక అధిక శాతం కొవ్వును కాల్చడానికి సహాయపడుతుందని అధ్యయనంలో తేలింది. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల 70 శాతం ఎక్కువ కొవ్వు కరుగుతుందని పరిశోధకులు గమనించారు.
ఉపవాసం నడక విషయంలో ఈ జాగ్రత్త తప్పనిసరి
డయాబెటిస్, అధిక రక్తపోటు,రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో వాకింగ్ చేయాలనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తలతిరగడం, వణుకు, మూర్ఛపోవడం వంటివి తక్కువ రక్తంలో చక్కెర తదితర ప్రభావాల కారణంగా ఎక్కువ సమయం పాటు ఖాళీ కడుపు వాకింగ్ ప్రమాదకరం కావచ్చని నిపుణులు తెలిపారు. ఖాళీ కడుపుతో నడవడం వల్ల కలిగే మరో దుష్ప్రభావం ఏంటంటే..శరీరంలో శక్తిని అందించడానికి తగినంత కార్బోహైడ్రేట్లు లేకపోతే శరీరం గ్లూకోనోజెనిసిస్ అనే ప్రక్రియను ప్రారంభిస్తుంది, ఇది ప్రోటీన్‌ను ఇంధనంగా మారుస్తుంది. దీని అర్థం కండరాలను పునర్నిర్మించడానికి తక్కువ ప్రోటీన్ మిగిలి ఉండవచ్చని నిపుణులు చెప్పారు.
భోజనం తర్వాత వాకింగ్ చేస్తే ఏమవుతుంది?
భోజనం తర్వాత వాకింగ్ కూడా ఆరోగ్యానికి మేలు చేసుంది. భోజనం తర్వాత నడిచినప్పుడు శరీరం మీరు తిన్న ఆహారం నుండి గ్లూకోజ్‌ను శక్తి కోసం ఉపయోగిస్తుంది. ఉపవాసం నడకతో పోలిస్తే ఇది తప్పనిసరిగా ఎక్కువ కొవ్వును కాల్చలేకపోయినా, భోజనం తర్వాత 10-15 నిమిషాలు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఉబ్బరం నివారిస్తుందని నిపుణులు తెలిపారు.
ఎంత నడవాలి?
బరువు తగ్గడానికి,మొత్తం ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రతిరోజూ 30 నుండి 60 నిమిషాలు నడవడం మంచిదని నిపుణులు తెలిపారు. మొత్తం మీద బరువు తగ్గడం అనేది మీరు ఎంత వ్యాయామం చేస్తారనే దానిపై మాత్రమే ఆధారపడి ఉండదు. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలి, తగినంత నిద్ర పొందాలి, ఆహారంలో మార్పులు, వ్యాయామం ద్వారా ఎక్కువ కేలరీలను బర్న్ చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











