Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వ్యాయామం చేస్తుంటే ఇలా అనిపిస్తుందా? గుండెపోటు రావొచ్చు!
ఈ మధ్యకాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చిన్న వయస్సు వారు కూడా గుండెపోటుతో మృతి చెందుతున్న వార్తలు వింటూనే ఉన్నాం. యువత గుండెపోటుకు గురవ్వడం చాలా మందిని కలవరపెడుతోంది.
జిమ్ లో వ్యాయామం చేస్తూ గుండెపోటు వచ్చి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. జిమ్ లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలు కనిపించగానే జాగ్రత్త పడాలని, వీలైనంత త్వరగా వైద్యుల వద్దకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె సమస్యలను చెప్పే ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ - డబ్ల్యూహెచ్ఎఫ్ ప్రకారం వ్యాయామం లేకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 50 శాతం పెరుగుతుంది. అలాగే గుండెపోటుకు అత్యంత దోహదపడే కారకాలు ఏంటంటే..
* కదలకుండా ఉండే జీవనశైలి
* ధూమపానం
* అధికంగా మద్యం సేవించడం
* వ్యాయామం చేయకపోవడం
* అధిక రక్తపోటు
* రక్తంలో అధిక చక్కెర స్థాయిలు
* అధిక కొలెస్ట్రాల్
* ఊబకాయం
* టైప్-2 డయాబెటిస్
* సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం
వ్యాయామం చేస్తున్నప్పుడు ఇలా అనిపిస్తే జాగ్రత్త!
ఛాతీ అసౌకర్యం:
ఆకస్మికంగా తీవ్రమైన ఛాతీ నొప్పి గుండెపోటు వస్తుందనడానికి మొదటి సంకేతం. ఇది తేలికపాటి అసౌకర్యంతో ప్రారంభమవుతుంది. తర్వాత అధిక ఒత్తిడి, ఛాతీ మధ్యలో భారంగా అనిపించడం తీవ్రమవుతుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు ఇలా అనిపించగానే వెంటనే వ్యాయామం చేయడం ఆపేసి వీలైనంత త్వరగా వైద్యుల వద్దకు వెళ్లాలి.
శ్వాస ఆడకపోవడం:
వ్యాయామం చేస్తున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపిస్తే.. ఈ గుండె మిమ్మల్ని హెచ్చరిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇలా అనిపించిన వెంటనే వ్యాయామం ఆపేసి విశ్రాంతి తీసుకోవాలి. ఎక్సర్‌సైజ్ చేస్తున్న సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పి, ఛాతీలో అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం లాంటి సంకేతాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి.
లైట్-హెడెడ్‌నెస్:
వ్యాయామం చేస్తున్నప్పుడు అలసట అనిపించడం చాలా సాధారణం. అయితే తల తిరగడం, తేలికగా అనిపించడం మొదలైతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వీటి వల్ల గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులు వచ్చి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి.
విపరీతంగా చెమటలు పట్టడం:
విపరీతంగా చెమటలు పట్టడం అనేది గుండె సరిగ్గా పని చేయడం లేదని, హృదయ సంబంధిత సమస్యలు ఉన్నాయని సూచిస్తుంది.
గుండె వేగంగా కొట్టుకోవడం:
గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా పెరిగిపోతే ఉన్నపళంగా వైద్య సాయం తీసుకోవాలని అర్థం. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.
ఇతర శరీర భాగాల్లో అసౌకర్యం:
గుండె సంబంధిత సమస్యలు ఉంటే ఛాతీతో పాటు శరీరంలోని ఇతర భాగాల్లో కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది. చేతులు, వీపు, మెడ, దవడ, కడుపులో అసౌకర్యంగా, నొప్పిగా, ఒత్తిడిగా అనిపిస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications