Latest Updates
-
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా!
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
ఉదయం లేవగానే బరువు చెక్ చేసుకోవడం మీకు అలవాటా? అందులో నంబర్ కొద్దిగా తగ్గితే సంతోషపడిపోవడం, పెరిగితే నిరాశపడటం చేస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. నేటి ఫిట్ నెస్ ప్రపంచంలో చాలామందికి బరువు తగ్గడానికి,కొవ్వు కరగడానికి మధ్య ఉన్న తేడా తెలియక గందరగోళానికి గురవుతుంటారు.

బరువు తగ్గితే మనం ఫిట్ గా మారుతున్నామని భ్రమపడతారు. కానీ ప్రముఖ డైటీషియన్,పైలేట్స్ ట్రైనర్ దర్శన్ జోషి చెబుతున్న దాని ప్రకారం.. శరీర బరువు తగ్గిన ప్రతిసారీ కొవ్వు తగ్గినట్లు కాదు, కొన్నిసార్లు అది నీరు లేదా కండరాల బరువు కూడా కావచ్చు. సరైన ఫిట్ నెస్ లక్ష్యాలను ఎంచుకున్నప్పుడే శరీరంలో శాశ్వతమైన, ఆరోగ్యకరమైన మార్పులను చూడగలం.
అసలు ఈ రెండింటికీ తేడా ఏంటి?
బరువు తగ్గడం
శరీర మొత్తం బరువు తగ్గడాన్ని ఇది సూచిస్తుంది. దీనిలో కొవ్వుతో పాటు నీరు, కండరాలు, ఎముకల బరువు కూడా కలిసి ఉంటాయి. ఉదాహరణకు ఎవరైనా క్రాష్ డైట్ చేసినప్పుడు, పస్తులున్నప్పుడు లేదా విపరీతంగా చెమటలు చిందించినప్పుడు బరువు అమాంతం పడిపోవచ్చు. కానీ దీని అర్థం శరీరంలోని అదనపు కొవ్వు పూర్తిగా కరిగిపోయిందని కాదు. ఇది కేవలం తాత్కాలిక మార్పు మాత్రమే.
కొవ్వు కరగడం
శరీరంలోని కండరాల బలాన్ని సురక్షితంగా కాపాడుకుంటూ.. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును మాత్రమే కరిగించడాన్ని ఫ్యాట్ లాస్ అంటారు. దర్శన్ జోషి సూచనల ప్రకారం, మన నిజమైన ఫిట్ నెస్ లక్ష్యం ఎప్పుడూ ఇదే కావాలి. ఇలా కొవ్వు కరిగినప్పుడే శరీరం టోన్డ్ గా, దృఢంగా, ఆకర్షణీయంగా మారుతుంది. దీనివల్ల నడుము సైజు తగ్గడమే కాకుండా ఎనర్జీ లెవల్స్ కూడా అమాంతం పెరుగుతాయి.
మీరెలాంటి లక్ష్యాన్ని ఎంచుకోవాలి?
మీరు దేనిపై దృష్టి పెట్టాలనేది మీ ప్రస్తుత శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఊబకాయం లేదా తీవ్రమైన అధిక బరువుతో బాధపడుతుంటే.. ప్రారంభంలో బరువు తగ్గడం అవసరం. అయితే దానికి సరైన వ్యాయామం, సమతుల్య ఆహారం తోడవాలి. అలాకాకుండా మీరు సాధారణ బరువు ఉండి కూడా పొట్ట ముందుకు రావడం, శరీరం వదులుగా, నీరసంగా అనిపించడం వంటి సమస్యలు ఉంటే.. మీరు కేవలం బరువు తగ్గడం కంటే, కొవ్వును కరిగించి కండరాలను బలోపేతం చేసుకోవడం పైనే పూర్తి ఫోకస్ చేయాలి.
మెషీన్స్ ని మాత్రమే నమ్మకండి
ఫిట్ నెస్ ను కేవలం బరువును కొలిచే యంత్రాలతోనే అంచనా వేయలేం. కొన్నిసార్లు బరువు అలాగే ఉన్నా లేదా కొద్దిగా పెరిగినా.. శరీరంలో కొవ్వు కరిగిపోయి, కండరాల పరిమాణం పెరిగి ఉండొచ్చు. కండరాలు కొవ్వు కంటే తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి కాబట్టి మీరు మునుపటికంటే సన్నగా, ఫిట్ గా కనిపిస్తారు. అందుకే ఈ కింది మార్పులను కూడా గమనించండి.
మీ నడుము సైజు లేదా ఇంచెస్ తగ్గుతున్నాయా?
-ఇదివరకు టైట్‌గా ఉన్న బట్టలు ఇప్పుడు పర్ఫెక్ట్ గా సరిపోతున్నాయా?
-రోజువారీ పనులు లేదా వ్యాయామం చేసేటప్పుడు మీ బలం, స్టామినా పెరిగాయా?
-పాత ఫోటోలకు, ఇప్పటికీ మీ శరీర ఆకృతిలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయా?
-రోజంతా ఎలాంటి అలసట లేకుండా చురుకుగా ఉంటున్నారా?
ఈ ప్రశ్నలకు సమాధానం అవును అయితే, మీరు కచ్చితంగా సరైన ట్రాక్‌లో ఉన్నట్లే.
కొవ్వును కరిగించడానికి దర్శన్ జోషి చెబుతున్న బెస్ట్ టిప్స్
నిజమైన ఫ్యాట్ లాస్ సాధించడానికి మీ రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. కేలరీల సమతుల్యత పాటించండి. కేవలం కార్డియో మాత్రమే కాకుండా బలాన్ని పెంచే స్ట్రెంత్ ట్రైనింగ్,పైలేట్స్ వంటి వ్యాయామాలు చేయండి. రోజంతా యాక్టివ్ గా ఉండటం, పుష్కలంగా నీళ్లు తాగడం, అన్నిటికంటే ముఖ్యంగా రాత్రిపూట కంటినిండా నిద్రపోవడం చాలా అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications