Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వర్షాకాల వ్యాధులు.... చాయ్ చేసే మేలు!

1. హెర్బల్ చాయ్ తాగండి: హెర్బల్ టీ లో సహజసిద్ధమైన ఆరోగ్య దినుసులు మిరియాలు, లవంగం, జింజర్, టీ ఆకులు, మింట్, తులసి, అశ్వగంధి మొదలైనవి వుంటాయి. ఇవన్నిసహజంగా చల్లదనాన్ని దగ్గర చేరనీయవు. దగ్గు, జలుబులకు మంచి నివారణ. గొంతు శరీరంలో చల్లదనాన్ని త్వరగా గ్రహించే ఒక భాగం. వర్షాకాలంలో ఉదయం వేళలో ఒ హెర్బల్ టీ తాగితేగొంతు సంబంధిత బాధలు రాకుండా వుంటాయి.
2. యూకలిప్టస్ ఆయిల్ వాడండి: ముక్కు కారుతుంటే, మీ కర్చీఫ్ లో నాలుగు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి రోజంతా దానిని వాసన చూస్తుండండి. ఘాటైన దీని వాసన మీ శ్వాసను హాయిగా వుంచుతుంది. ఈ ఆయిల్ ప్రతి మందుల షాపులోను లభిస్తుంది.
3. వేపను ఉపయోగించండి. వేప చెట్టులో కావలసినన్ని ఔషధ గుణాలుంటాయి. వర్షాకాలంలో ఎలర్జీ కలుగకుండా వాడచ్చు. మరిగే వేడి నీటిలో వేపాకులు వేసి దాని ఆవిరి పీల్చండి. ఇది సాధ్యం కాకపోతే, వేప నూనె సబ్బులు వాడండి. ఈ చర్య వ్యాధుల నుండి సహజ రక్షణ కల్పిస్తుంది.
4. కాళ్ళు సరిగా శుభ్రం చేసుకోండి: కాళ్ళు వానలప్పుడు బురద, మట్టి మొదలైన వాటికి గురవుతాయి. దీనిలోని బాక్టీరియా సరిగా శుభ్రం చేయకపోతే శరీరానికి వ్యాపిస్తుంది. జబ్బు పడకూడదనుకుంటే, ఈ కాలంలో కాళ్ళను వీలైనంత పరిశుభ్రంగా వుంచుకోవాలి. వీలైతే వేడి నీటిలో కాళ్ళను కనీసం అయిదు నిమిషాలు నానపెట్టి తర్వాత సబ్బుతో శుభ్రం చేయండి.
5. వేడి నీరు తాగండి: వర్షాకాలంలో తాగే నీరు పొట్ట సంబంధిత వ్యాధులను తెస్తుంది. కనుక ఈ వ్యాధులనుండి రక్షణ పొందాలంటే కాచి చల్లార్చిన నీరు తాగాల్సిందే. నీటిని కనీసం 10 నిమిషాలు మరగించండి మరిగేటపుడు కాసిని తులసి ఆకులు కూడా వేయండి.
ఈ చర్యలను పాటించి వర్షాకాల వ్యాధులనుండి రక్షణ పొందండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications