Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రుతుక్రమం ఆలస్యమవుతోందా?

బరువు కోల్పోవటం, వ్యాయామం అధికంగా చేయటం, స్మాకింగ్, కాఫీలు, మందులు, ఆహార లేమి, మొదలైనవి క్రమం తప్పిన రుతుక్రమానికి దోవతీస్తాయి. రక్తస్రావం అధికంగా వుండటం, కటి వలయం లేదా పొట్ట కిందిభాగంలో నొప్పి, పిరీయడ్స్ లేకపోవటం, మొదలైనవి, సరి అయిన సమయానికి రుతుక్రమం రాకపోవటానికి సంకేతాలు. అయితే, రుతుక్రమాన్ని సరిగా నియంత్రించుకోడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేమిటో చూద్దాం.....
ములక్కాడలు, పొట్లకాయ, తెల్ల గుమ్మడి, నువ్వులు, కాకరకాయ మొదలైనవి బాగా తినండి. ఇవి రుతుక్రమాన్ని సరిగా వచ్చేలా చేస్తాయి. కాకర రసాన్ని అవసరపడితే రోజుకు రెండు సార్లు తాగి అయినా సరే రుతుక్రమం సరిగా వచ్చేలా చేసుకోవచ్చు. నెలసరి వచ్చే ఒక వారం ముందు కోడిగుడ్డు, మాంసం, పసుపు గుమ్మడి, బంగాళ దుంపల వాడకం మానండి.
నువ్వులు లేదా జీలకర్ర డికాషన్ వంటివి రుతుక్రమం సరిగా వచ్చేలా చేస్తాయి. రుతుక్రమ డేట్ కు ఒక వారం రోజుల ముందు వీటిని వాడాలి. నువ్వుగింజలు, మెంతి పొడి, బెల్లం కలిపిన మిశ్రమం బాగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసెడు గ్రేప్ జ్యూస్ తాగి కూడా పిరీయడ్స్ సహజంగా వచ్చేలా చూసుకోవచ్చు. ప్రతిరోజూ కొద్దిపాటి వ్యాయామం కూడా చేయాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి పిరీయడ్స్ సక్రమంగా వచ్చేలా చేస్తుంది.
పచ్చి బొప్పాయి తినండి. పిరీయడ్స్ సక్రమంగా రావటమే కాదు. ప్రెగ్నెన్సీ వద్దనుకున్నా దీనిని వాడవచ్చు. మర్రి చెట్టు వేళ్ళ డికాషన్ పాలతో కలిపి మూడు నెలలు వరుసగా తీసుకున్నా రుతుక్రమం సరిగా వస్తుంది.
పై చిట్కాలను పాటించి ఆరోగ్యవంతంగా జీవనం సాగించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications