Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
మెడ బెణుకు నొప్పిని త్వరగా తగ్గించుకోడమెలా?!

మెడనొప్పి ఎందుకు వస్తుంది?
ప్రధానంగా సరిగ్గా పడుకోకపోవటం వలన వస్తుంది. మనమంతా నిద్రలో సరిగా పడుకోము. ఆ కారణంగా మెడ వెనుక భాగంలో నొప్పి వస్తూనే వుంటుంది. మనం వేసుకునే తలగడ సరి లేకున్నా మెడనొప్పి వచ్చే అవకాశం వుంది. కొంతమంది ఎంతో చిన్న దిండ్లను వాడి సమస్య తెచ్చుకుంటారు. మరి కొంతమంది అధిక ఎత్తు కల తలగడలు వాడతారు. అధిక బరువులను ఒక్కసారి పైకి ఎత్తటం కూడా మీ శరీర గురుత్వాకర్షణ శక్తికి భంగం వాటిల్లి మెడ నొప్పి వచ్చే ప్రమాదం వుంది. సరిగ్గా కూర్చొనకపోయినా ఒకోసారి ఈ నొప్పి వచ్చే అకాశం వుంది. ఈ నొప్పి ఎముకలలో జరిగే కొద్దిపాటి మార్పుకు వచ్చేసే అవకాశం వుంది.
మెడ నొప్పిని నివారించుకోవడం ఎలా?
సాధారణంగా ఇంట్లో ఇతర శరీర నొప్పులకు అనేక పరిష్కారాలుంటాయి. కాని మెడనొప్పి అంత తొందరగా పరిష్కరమయ్యేది కాదు. దీనికి మంచి మందు అంటే - తిన్నగా సరి అయిన పొజిషన్ లో ఒక రాత్రి పూర్తిగా మంచి నిద్రపోవటమే. మరుసటి దినం ఉదయానికి సుమారుగా 70 శాతం నొప్పి తగ్గిపోతుంది. ఇక మెడను ఆ పక్కకు, ఈ పక్కకు మెల్లగా తిప్పే వ్యాయామాలు కొంత ఉపశమనమివ్వగలవు. వెచ్చటి శరీర నూనె మెల్లగా మెడచుట్టూతా, భుజాలూ మర్దన చేస్తే ఎంతో రిలీఫ్ దొరుకుతుంది. ఒక మందపాటి గుడ్డను వేడినీటిలో ముంచి మెడకు చుట్టినా అది మెడ కండరాలపై ప్రభావం చూపి నొప్పిని తగ్గించే అవకాశాలున్నాయి.
తక్షణం నొప్పి తగ్గాలంటే.....
తక్షణ నొప్పి మందులు లేదా స్ప్రే లు వాడవచ్చు. కాని సమస్యను సమూలంగా ఇవి తగ్గించలేవు. అవి మీ మెడ కండరాలను తిమ్మిరి ఎక్కించి నొప్పిని తగ్గిస్తాయి. దీని కొరకు పెయిన్ కిల్లర్ మందులు మింగటం ఏ మాత్రం సరికాదు. మన బిజీ జీవితాల్లో మెడ నొప్పులు కూడా త్వరగా తగ్గాలని మనం ప్రయత్నిస్తాం. కాని మీ వేగాన్ని కొంత తగ్గించండి. మందులు వాడకం విచక్షణతో కూడినది కాకుంటే దీర్ఘకాల చెడు ప్రభావాలుంటాయి. నొప్పులవంటి చిన్న చిన్న అనారోగ్యాలు సహజపద్ధతులద్వారా నివారించుకుంటే ఆ పరిష్కారం శాశ్వతంగా కూడా వుంటుంది. కనుక శరీరం దానికదే నొప్పులు తగ్గించుకునేందుకు కొంత సమయం ఇవ్వండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications