Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
వారాంతపు సెలవులా.... ! ఆనందో బ్రహ్మ.....!

ఈ పరుగులోపడి ఫిట్ నెస్ కు అవసరమైన రోజువారీ వ్యాయామాలు సైతం మరచిపోతాం. ఆఫీస్ కు లేదా పనికి వేళకే చేరతాము. అయితే, ఒక్క అరగంట కేటాయించి ఆరోగ్యానికి అవసరమైన వ్యాయామాలను అశ్రధ్ధ చేస్తాం. అరగంట రోజూ వ్యాయామానికి కేటాయించడం అంటే, కష్టమే! కాని శరీరాన్ని వ్యాధులబారినుండి రక్షించుకొని అవసరమైన వ్యాధినిరోధక శక్తి కొరకు ఈ మాత్రం కేటాయింపు తప్పదు.
ఇక బయటకు వస్తే కూల్ డ్రింకులు, బిస్కట్లు, బేకరీ ఐటమ్, ఫాస్ట్ ఫుడ్ లు తింటూనే వుంటాం. వీటన్నిటికి గుడ్ బై చెప్పి వాటికి పెట్టే డబ్బు పండ్లు, సలాడ్ లు, సూప్ లు మొదలగు ఆరోగ్యకర తిండి పదార్ధాలను పెడితే శరీరానికి మంచిది. మంచి ఆకలి కూడా వేస్తుంది. ఇంట్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా తేలికగాతయారు చేసేదిగాను ఆరోగ్యకరమైనదిగాను వుండాలి. దానికిగాను కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ మొదలైనవి సూచించవచ్చు.
మన బిజీ జీవితాల్లో కూడా ఒత్తిడి తగ్గించుకోడానికి, కొద్దిపాటి ఆనందానికి మ్యూజిక్ వినడం ఎంతో మంచిది. ఇక పనిభారం మాటకి వస్తే పాజిటివ్ ఆలోచన మంచిది. కొన్ని పనులు ఒకో సమయంలో విసుగనిపిస్తాయి. వాటిని ఆసక్తికరంగా మలుచుకొని కొత్త విధంగా చేస్తూవుంటే మీకు ఎంతో శక్తినిస్తాయి.
వారమంతా బిజీగా గడిపేసినా, వారాంతపు సెలవలను కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు కేటాయించండి. సాధారణంగా వీరిని పని రోజుల్లో దూరంగా వుంచాతాం. లేట్ నైట్ పార్టీలు మానండి. ఆనందాన్నిచ్చే ఆటపాటలతో కాలక్షేపం చేయండి. ఫలితాలు అధ్భుతంగా వుంటాయి.
జీవితంలో మొదటి రూలు - మనం ఏది చేసినా అది సంతోషాన్నిచ్చేది అయివుండాలి. అపుడు చేసే పని మీకవసరమైన ఎనర్జీనిస్తుంది. లైఫ్ ఎంత బిజీ అయినప్పటికి అవసరమైన ఇతర పనులు కూడా చేసుకుంటే మెచ్చుకోదగినదే. బిజీ లైఫ్ లో కూడా కొంచెం తేలిక పడటం జరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications