Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
స్మోకింగ్ ఒక వ్యాధిలాంటిది..బానిసలు కాకండి!

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది పొగాకు కారణంగా సంక్రమించిన వ్యాధుల వల్ల అకాల మృత్యువు వాత బడుతున్నారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా పొగతాగేవారు ఏడాదికి దాదాపు 6,000 బిలియన్ల సిగరెట్లను కాల్చేస్తున్నట్లు అధ్యయనం చెపుతోంది. వ్యక్తిగతంగా పొగతాగే వారికి హాని కలిగించటమే కాకుండా, వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఎంతగానో పెరుగుతుంది.... చిన్న పిల్లలు, పొగతాగని ఇతర వ్యక్తులు కూడా పేసివ్ స్మాకింగ్ కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తోంది.
అంతేకాక, పొగాకు ప్రాసెసింగ్‌కు పెద్ద ఎత్తున వంటచెరుకు కావాలి. అందువల్ల పొగాకు సాగు, ప్రాసెసింగ్‌ల కోసం ప్రతి సంవత్సరం పచ్చని అడవులు నరికివేతకు గురవుతూ పర్యావరణానికి సైతం ఎనలేని నష్టాన్ని సిగరెట్లు కలిగిస్తున్నాయి. పొగాకు పరిశ్రమ వల్ల ఉత్పత్తి దేశాల ఖజానాలకు భారీగానే ఆదాయం సమకూరుతోంది. కానీ అదే సమయంలో ఆ దేశాలు పొగాకు దుష్‌ప్రభావం కారణంగా సంక్రమించే వ్యాధుల చికిత్సకోసం, ప్రజా ఆరోగ్యం కోసం అనేక రెట్ల మొత్తంలో డబ్బును ఖర్చుచేయాల్సి వస్తోంది. సిగరెట్ దుష్ ప్రభావాలపై సినిమాలు సైతం ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాయి. ప్రభుత్వాలు సైతం పొగతాటం నిషేధించబడినదంటూ ప్రకటనలు చేస్తున్నాయి.
పొగాకు చుట్టూ వున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, పర్యావరణ నష్టాల కారణంగా పొగాకుకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు, పొగాకు అ లవాటు (జబ్బు) నుంచ బయటపడేందుకు సత్వరమే ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications