Latest Updates
-
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
మీ ఆరోగ్య, సంక్షేమాల రహస్యం... ! ఎక్కడ?

మానసిక ఆనందం లేదా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ - ఆరోగ్యానికి చక్కటి మంత్రం...ప్రతి ఒక్కరూ తమలో తాము మానసిక ఆనందం కలిగి వుండటం. చాలామంది ఫిట్ నెస్ అంటే...బయటకు బాగా కనపడటమని భావిస్తూ అసలైన మానసిక ఆనందం కోల్పోతూంటారు.
ఆహారం - డైటింగ్ అన్న పేరుతో మీ కిష్టమైనవి తినకపోవడం సరి కాదు. ఆహారమంటే మీకు సరైన భావన వుండాలి. మన ముందటి నాగరికతలు, మతాలు అన్నీ కూడా పంటలు, ఆహారం వంటివి భగవంతుడిగా భావించి మంచికి మాత్రమే ముడిపెట్టాయి. మీ కిష్టమైనవి తినండి. అయితే ఏ తిండీ కూడా అధికంగా కొనసాగించకండి.
వ్యాయామాలు - ఎవరికిష్టమైన వ్యాయామం వారు స్వేచ్ఛగా ఎంపిక చేయండి. ప్రతి దినం ఆచరించండి. శరీరం, మనస్సు రెండూ కూడా ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శుభ్ర పడాలంటే 'యోగా' ఆచరించడం మంచి సాధనం కాగలదు.
పాజిటివ్ గా వుండండి - సవ్యమైన ఆలోచనలు చేయండి. పాజిటివ్ గా భావించే వ్యక్తులతో తిరిగి, వారినుండి సవ్యత్వం నేర్చుకొని మంచివారిగా వుంటూ మానసిక ఆనందం పొందండి. మోసాలు, మాయలు చేయటం, నిరాశలకు లోనవటం మొదలైనవి చిన్న అంశాలలోనైనా సరే దుఖా:న్ని కలిగిస్తాయి. ప్రతివారికి రోజూవారీ జీవితంలో ఒత్తిడి వుంది. ఆ ఒత్తిడి ఎంతవరకో అంతే వుండాలిగానీ అధికం కారాదు. ఒత్తిడి తగ్గటానికి, చక్కటి సంగీతం వినటం లేదా సాధన చేయటం లేదా ప్రాణాయామం వంటి శ్వాస సంబంధిత చర్యలు, కొద్దిపాటి నడక మొదలైనవి ఆచరిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. ఎవరికైతే తమ శారీరక అవసరాలు తెలుస్తాయో వారు తమ ఒత్తిడులను కూడా అధిగమించగలరు.
ఆరోగ్య, సంక్షేమాలకు ఎస్ట్రాలజీ - ఖగోళం నుండి కొన్ని ఎనర్జీలు వ్యక్తులపైనా, గ్రహాలపైనా, జంతువులపైనా, లేదంటే భూమిపైన కూడా ప్రసరిస్తూంటాయి. ఆరోగ్యం, అనారోగ్యాలు, యాక్సిడెంట్లు మొదలైనవి ఎపుడు కలుగుతాయనేది తెలుసుకోవాలంటే ఎస్ట్రాలజీ ఒక సాధనం. ఆరోగ్యం, ఆనందాలతో జీవించాలంటే ఈ ఎనర్జీలను ఉపయోగించి సరైన ఆహారం, సరైన ప్రదేశం, జీవనం, సరైన సంబంధాలు, సరైన ఆధ్యాత్మిక సాధనలు కలిగి వుండండి. ఉదాహరణగా చెప్పాలంటే....కుజగ్రహం ఒక వేడికల గ్రహం. ఇది జ్వరం, శారీరక నొప్పులు, మంటలు, ఇన్ఫెక్షన్, గాయాలు వంటి వాటికి కారణమవుతుంది. దీనిని ఎదుర్కొనాలంటే...వ్యక్తి తన జన్మకుండలి మేరకు ఆ సమయాలలో ఆ గ్రహాలకు అనుకూలమైన ఆహారాలు, ఔషధ మూలికలు తినటం, అట్టి గ్రహాల దృష్టిపడే రత్నాలు ధరించటం, లేదా ఆ గ్రహ మంత్రాలు ఆచరించడం వంటివి చేయాలి.
అనారోగ్య సమస్యలనుండి దూరంగా వుండాలంటే ప్రతివారూ తమ జన్మకుండలి లేదా జాతకం ఎప్పటికపుడు నిపుణులకు చూపి తగిన పరిష్కార మార్గాలు సమయం మేరకు ఆచరిస్తే ఫలితాలు బాగుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
