Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
మందు తాగండి - సైడ్ డిషెస్ మానండి!

1. కారంగా వుండే నూనె వస్తువులు: ఆల్కహాలు ఎసిడిటీ కలిగిస్తుంది. కనుక తాగిన తర్వాత ఎక్కువ నూనెలు వుండే పదార్ధాలు డిన్నర్ గా తీసుకోవద్దు. పొట్ట తాగిన ఆల్కహాల్ ను బ్యాలన్స్ చేస్తూ ఇతర పదార్ధాలు జీర్ణం చేయాలి కనుక తినేది చాలా లైట్ గా వుండాలి. కనుక తాగిన తర్వాత బిర్యాని వంటివి తినవద్దు.
2. పాల ఉత్పత్తులు: కొంతమంది ఆల్కహాలు తీసుకునేటపుడు జున్ను ముక్కలు తింటారు. కాని ఇది సరికాదు. ఛీజ్, బటర్, పాలు మొదలైనవి జీర్ణం కావటం కష్టం. ప్రత్యేకించి రాత్రివేళ వీటిని తినరాదు. దీనివలన అజీర్ణం, కడుపులో మంట వంటివి కలుగుతాయి. ఛీజ్ అధికంగా వుండే పిజ్జా, లేదా పస్తా వంటివి కూడా తినరాదు.
3. సాధారణంగా రెస్టరెంట్లలో ఆల్కహాలుకు పక్కన వేరు శెనగ లేదా జీడిపప్పు వంటివి ఆహారంగా పెడతారు. వారు వీటిని ఉచితంగా ఇచ్చినప్పటికి అవి ఆల్కహాలుతో పాటు సరి అయిన ఆహారం కాదు. వీటిలో అధికమైన కొల్లెస్టరాల్ వుండి మీ ఆకలిని మందగిస్తుంది.
4. ఉప్పగా వుండే ఆహారాలు: చాలామంది సైడ్ డిష్ గా పొటాటో చిప్స్ తింటారు. కాని ఇవి కూడా తినరాదు. ఉప్పటి పదార్ధాలు దాహాన్ని పెంచి మరింత తాగేలా చేస్తాయి. శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి.
5. స్వీట్లు: చాక్లెట్ల వంటి తీపి పదార్ధాలు మరింత మత్తును కలిగిస్తాయి. మరింత తాగేలా చేసి కంట్రోలు తప్పిస్తాయి. కనుక తాగేటపుడు స్వీట్లను అసలు ముట్టరాదు.
6. సోడాలు లేదా ఇతర కూల్ డ్రింక్ లు: మీ డ్రింకులను సోడా లేదా ఇతర కూల్ డ్రింక్స్ తో కలపకండి. ఆల్కహాలు డీహైడ్రేషన్ కలిగిస్తే, ఈ డ్రింకులు దానిని అధికం చేస్తాయి. ఆల్కహాలు ప్లెయిన్ వాటర్ లేదా ఐస్ తో కలుపవచ్చు లేదంటే, పండ్ల రసాలతో కలిపి తీసుకోవచ్చు.
పక్కన ఈ తిండి పదార్ధాలను తప్పిస్తే, ఎప్పుడో ఒకసారి తీసుకునే ఆల్కహాలు మీకు హాని కలిగించకపోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
