Latest Updates
-
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా!
బరువు తగ్గాలంటే 25 రకాల ఆహారాలు!
బరువు తగ్గాలంటూ ఆహారం తినకుండా పస్తులుంటున్నారా? అసలు ఆహారం మానేయటం కన్నా...సరైన ఆహారం తీసుకునేందుకు ప్రయత్నించండి. మరి మీ కొరకు మేము 25 రకాల ఆహారాలను ఎంపిక చేశాము. వీటిని మీ జాబితాలో పై వరుసలో పెట్టండి. ఈ ఆహారాలు మీకు తగిన పోషకాలను అందించటమే కాదు, మీ పొట్ట కొవ్వు గణనీయంగా తగ్గేలా చేస్తాయి.

ఆలివ్ నూనె - ఈ నూనెతో చేసే వంటకాలు ఎంతో ఆరోగ్యం. మంచి కొలెస్టరాల్ పెంచుతాయి. కడుపు నింపి అధిక ఆకలి కాకుండా చేస్తాయి.ఆపిల్స్ - ఆపిల్స్ లో కేలరీలు తక్కువ. పీచు అధికం. తిన్నది బాగా జీర్ణం చేస్తుంది. దీనిలోని పెక్టిన్ మీకు కడుపు నిండినట్లు భావించేలా చేస్తుంది.
టమాటాలు - విటమిన్ సి టమాటాలలో అధికం. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కేలరీలు తక్కువ. సూప్, సలాడ్, పప్పు లేదా పండుగా కూడా తినేయవచ్చు. కేన్సర్, గుండెజబ్బులను నివారిస్తాయి. చర్మం మెరిసేలా చేస్తాయి.
కొబ్బరి - కొబ్బరి కడుపు నింపుతుంది. ఆరోగ్యకర కొవ్వును ఇస్తుంది. పోషకాలు అధికం.
నిమ్మకాయ - దీనిలో విటమిన్ సి అధికం. మీ జీవప్రక్రియ పెంచుతుంది. స్లిమ్ గా ఉంచుతుంది. ఎసిడిటీ తగ్గించి మొండి రోగాలను దూరం చేస్తుంది.
గ్రీన్ టీ - గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కొవ్వును కరిగించి మెటబాలిజం అధికం చేస్తుంది. రోజూ ఒకటి లేదా రెండు కప్పులు తాగితే చెడు కొల్లెస్టరాల్ స్ధాయిలు తగ్గిస్తుంది.
వాల్ నట్స్ - దీనిని బ్రెయిన్ ఫుడ్ అంటారు. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఆరోగ్యకరమైన చిరుతిండి. కడుపు నింపుతుంది.
మొలకెత్తిన విత్తనాలు - పెసలు, శనగలు, వేరు శనగ పప్పులు, అలచందలవంటివి నానపోసి మొలకలు వచ్చిన తర్వాత తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని శక్తి గుళికలు అంటారు. కడుపు నింపుతాయి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు సమకూరుతాయి.
ద్రాక్ష - ప్రతిరోజు కొద్దిగా తింటే చాలు వీటిలో కావలసినంత ఫైబర్, నీరు ఉండి కడుపు నింపేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికం వయసు కనపడనీయకుండా చేస్తాయి.
పెరుగు - పెరుగులో మంచి కాల్షియం, ప్రొటీన్లు ఉంటాయి. కొవ్వు కరిగిస్తుంది. మేలు చేసే బాక్టీరియా మీ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
ఆకు కూరలు - కేలరీలు తక్కువ, పీచు ఎక్కువ, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ కనుక డయాబెటిక్ రోగులు కూడా తినవచ్చు. కడుపు నింపుతాయి. రక్తాన్ని శుభ్ర పరుస్తాయి.
కేరట్లు - కార్బో హైడ్రేట్లు అధికంగా ఉండి త్వరగా ఆకలినిస్తాయి. పీచు, విటమిన్ ఎ మరియు బి కాంప్లెక్స్ అధికం. ఇవి సాఫీగా విరోచనం చేస్తాయి.
అరటి పండ్లు - నీటి శాతం అధికం. పీచు ఉంటుంది. కడుపు నింపుతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. మూడ్ మంచిగా ఉండేలా చేస్తాయి.
కివి పండ్లు - కడుపు నింపుతాయి. పీచు అధికం. కేలరీలు తక్కువ, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ.
ఓట్లు - ఆరోగ్యకర చిరుతిండి. పీచు అధికం, కడుపు నింపుతాయి. పోషకాలు వంటికి పట్టేలా చేస్తాయి.
చిలకడ దుంప - గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ కనుక డయాబెటిక్ రోగులు కూడా తినవచ్చు. పీచు బాగా ఉండి ఆకలి తీరుస్తుంది.
గోంగూర - గోంగూరలో పీచు, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు గోంగూర లో 35 కేలరీలు ఉంటాయి. పప్పులు, పులుసు, సలాడ్ అన్ని చేసుకోవచ్చు.
బీట్ రూట్ - పీచు అధికం, ఆరోగ్యకర షుగర్ వుండి ఆకలి తీరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.
అవిసె గింజలు - వీటిని సలాడ్లపై చల్లుకు తినవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. కొల్లెస్టరాల్ అదుపులో ఉంచి జీర్ణక్రియ పెంచుతాయి.
రేగుపండు - వీటిలో పెక్టిన్ ఫైబర్ ఉంటుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తాయి. బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. కొవ్వు కణాలను లిమిట్ చేస్తాయి.
చేపలు - చేపలను గుండె ఆహారంగా చెపుతారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండి ఎంతో మేలు చేస్తాయి. కొవ్వు కరిగిస్తాయి.
ఆరెంజస్ - విటమిన్ సి బాగా ఉంటుంది. వింటర్ జలుబులు అరికడతాయి. తక్కువ కేలరీలు. తీపి కోరిక తగ్గిస్తాయి.
బ్రక్కోలి - బ్రక్కోలిలో విటమిన్ ఎ మరియు సి మరియు కాల్షియం కూడా ఉంటాయి. వీటితో సూప్ సలాడ్ వంటివి చేసుకోవచ్చు. కేలరీలు తక్కువ.
గుడ్లు - ప్రొటీన్లు అధికం. ఎమినో యాసిడ్లు బరువు తగ్గించేస్తాయి. బ్లడ్ షుగర్ స్ధిరీకరించబడుతుంది. ఊబకాయం ఏర్పడకుండా చేస్తాయి.
కాటేజ్ ఛీజ్ - ప్రొటీన్లు అధికం. కాల్షియం బాగా ఉంటుంది. ఈ కాల్షియం కొవ్వును కరిగించి మీరు స్లిమ్ గా ఉండేలా చేస్తుంది.
ఈ రకమైన ఆహారాలు తింటూ ప్రతిరోజూ ఒక గంట వ్యాయామం చేస్తూంటే, మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది అంటారు ఎంతో అనుభవంకల పోషకాహార నిపుణులు మైధిలి మరియు సుశీల.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











