Latest Updates
-
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు -
చుక్క నూనె లేకుండా పాపడ్, చిప్స్ వేయించొచ్చు..సెలబ్రిటీ చెఫ్ సీక్రెట్ ట్రిక్!
పురుషుల్లో కొవ్వు తగ్గాలంటే ఇవి పెట్టండి?

ఆపిల్స్ - రోజుకు ఒక ఆపిల్ తింటే....డాక్టర్ అవసరం లేదంటారు. అది నిజమే. మీరు ఆరోగ్యంగా వుండాలంటే బరువు తగ్గాలంటే ప్రతిరోజూ మీ ఆఫీస్ కు వెళ్ళేటపుడు ఒక ఆపిల్ తినేయండి. ఆపిల్ ను పాలు లేదా పెరుగుతో జతచేసి కూడా తింటే రుచి మరింత పెరుగుతుంది. ఆపిల్ మీ రక్తంలోని గ్లూకోజ్ స్ధాయిలు తగ్గించటమే కాదు కరిగే పీచు కూడా కలిగి వుంటాయి. ఆపిల్స్ లో వుండే పెక్టిన్ శరీరంలోని అధిక నీటిని, కొవ్వును పీల్చేస్తుంది. అంతేకాదు ఆపిల్ మీకు తినాలనే వాంఛను కూడా తగ్గించి కొవ్వు కరిగేందుకు తోడ్పడుతుంది.
నిమ్మ పండు - నిమ్మ పండ్లలో విటమిన్ సి అధికం శరీరంలోని కేలరీలు ఖర్చు చేస్తుంది. పురుషులు నిమ్మ, ఆరెంజ్, బెర్రీ, ద్రాక్ష వంటి పండ్లు తింటే అదనపు కొవ్వు కరిగి పోతుంది. నిమ్మ బరువును సహజంగా తగ్గిస్తుంది.
గ్రీన్ టీ - చాలామంది కేఫైన్ బరువు వేగంగా తగ్గిస్తుందంటారు. ఆఫీసులో ఒకసారి కాఫీ తాగేసి బరువు తగ్గుతామని పురుషులు భావిస్తారు. రీసెర్చి మేరకు కాఫీ గుండె తీరును వేగం చేస్తుంది. కొవ్వు వేగంగా కరిగిస్తుంది. అయితే, కేఫైన్ తో పోలిస్తే గ్రీన్ టీ అధిక ప్రయోజనం. బరువు తగ్గిస్తుంది. ఆకలి నియంత్రిస్తుంది ఆరోగ్యంగా వుండేలా చేస్తుంది. బరువు తగ్గటమే కాక, ఈ హెర్బల్ టీ మీ చర్మానికి, వెంట్రుకలకు కూడా చాలా మంచిది. మరి ఒత్తిడితో జుట్టు ఊడుతుంటే, మీరు నల్లబడిపోతుంటే గ్రీన్ టీ తాగండి.
బాదం పప్పులు -బాదం పప్పు, వాల్ నట్, అప్రికాట్ వంటివి మంచి కొవ్వు కలిగించి, మంచి కొల్లెస్టరాల్ ఇస్తాయి. ఆకలి నియంత్రించాలన్నా, కడుపు నిండుగా వుంచుకోవాలన్నా ప్రతిరోజూ గుప్పెడు బాదంపప్పులు తినండి.
గుడ్లు - మీరు మాంసాహారి అయితే, గుడ్డును పూర్తిగా మీ బరువు తగ్గేందుకు వినియోగించండి. గుడ్లు ఆరోగ్యమే కాదు తేలికగా కడుపు నింపుతాయి. వాటిని ఉడికించి లేదా అతికొద్ది నూనెలో వేయించి ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ గా తినండి. గుడ్లను వెన్నతీసిన పాలతో కూడా తినవచ్చు.
ఈ అయిదు రకాల ఆహారాలు పురుషులలో కల అధిక శరీర కొవ్వును కఠినమైన ఆహార ప్రణాళికలు ఆచరించకుండానే కరిగిస్తాయి. కనుక ఈ ఆహారాలు మీ ఆహారాలలో చేర్చి ఆరోగ్యంగా, చురుకుగా, ఫిట్ గా వుండేలా చేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications