Latest Updates
-
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం!
అలసట తగ్గాలంటే అయిదు మార్గాలు!

అలసట పోగొట్టే అయిదు మార్గాలు
1. రాత్రివేళ గాఢ నిద్ర పొందండి - ఇది తేలికగానే కనపడుతుంది. కాని మీరు పోయే ఎనిమిది గంటల నిద్ర మీ అలసటను దూరం చేయలేదు. రాత్రి 10 గంటలకు నిద్రకు ఉపక్రమించటం, ఉదయం 6 గంటలకు లేవటం. మరుసటి రోజు మీకు బాగానే వుంటుంది. పెద్దవారు మరుసటిరోజు తాజా అనుభూతితో లేవాలంటే, ఒక్కసారిగా కనీసం 8 గంటల నిద్ర పోవాల్సిందే.
2. అధికంగా నిద్రించకండి - చాలాసార్లు, మనమంతా వారాంతపు సెలవలు వచ్చాయంటే, అధికంగా నిద్రించేస్తాం. వారంలో తగ్గిన నిద్ర గంటలను ఈ సమయంలో వినియోగిస్తాం. ఈ రకమైన భావన మనం చెప్పుకునేదే. దీనికి సైంటిఫిక్ నిరూపణ లేదు. 8 గంటలకు బదులుగా 10 గంటలు నిద్రించినప్పటికి మీకు అధికంగా వచ్చే తాజాదనం ఏమీ లేదు. పైపెచ్చు, మీ సోమరితనం అంటే ఎక్కువ నిద్రించటం మీకు అలసట కలిగిస్తుంది.
3. మంచి ఆహారాలు తినండి. భారం అనిపించే తిండ్లు తినకండి - తెల్లటి అన్నం, నూనె అధికంగా వుండే కూరలు వంటివి నిద్రకు ముందు తిని పడుకుంటే, అవి అరిగించటానికి మీ జీర్ణ వ్యవస్ధ రాత్రంతా పనిచేస్తూనే వుంటుంది. ఇక మరుసటి రోజు లేచిన వెంటనే మీకు తాజా అనుభూతి కలగనే కలగదు. అందుకుగాను మీరు పడుకునే సమయానికి మూడు గంటల ముందు తేలికగా జీర్ణం అయ్యే కూరలు, పండ్లు వంటి ఆహారాలు తింటే, మీకు ఆరోగ్యం బాగుంటుంది. మరుసటిరోజు అలసట కలిగించేటంతగా రాత్రి డిన్నర్ తినకండి.
4. సూర్యాస్తమయం తర్వాత కాఫీలు, టీలు వంటివి తాగకండి. మనలో చాలామంది సాయంత్రం పైన కనీసం ఒక కప్పు కాఫీ లేదా టీ తాగేస్తారు. మీ శరీరం పొందే అలసటకు ఇది కూడా ఒక కారణమే. సాయంకాలాలు తాగే కాఫీ మీ నిద్రను భంగపరుస్తుంది. కనుక సాయంకాలం మీకు ఎనర్జీ కావాలనుకుంటే మరేదైనా తినండి. లేదా చేయండి. మంచి నడక వంటివి మీకు ఎనర్జీ ఇస్తాయని గ్రహించండి.
5. అలసట అంటూ మసాజ్ తీసుకుంటున్నారా? ఇది సరైనదే అలసిన కండరాలకు మసాజ్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ధాయ్ మసాజ్ ఇతర మసాజ్ లు మీ కండరాలకు పురుజ్జీవాన్నిస్తాయి.నేటి ఆధునిక జీవన విధానాలకనుగుణంగా మనం మన సుఖం కొరకు అపుడపుడూ శరీరానికి చక్కటి మసాజ్ ఇవ్వాలి.
వాస్తవంగా చెప్పాలంటే, అలసట అనేది మన మానసిక స్ధితి. వీలైనంత సంతోషంగా వుంటూ మీ మానసిక అలసట దూరం చేయండి. అలసట దూరం చేయాలంటే, ఉత్సాహంగా, సవ్యమైన ఆలోచనలతో రోజును గడిపేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
