Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
విమాన ప్రయాణ అనారోగ్యం అరికట్టేందుకు ఆరు మార్గాలు!

తక్కువ తినండి - కడుపు నిండుగా వుంటే, కదలికల సమస్య వస్తుంది. కనుక విమానం ఎక్కేముందు తక్కువ తినండి. మీకిష్టమైన స్నాక్స్ మీతో తీసుకెళ్ళండి. ఈ చిరుతిండి మీకు ఎయిర్ సిక్ నెస్ రాకుండా చేస్తుంది.
ఆలోచించకండి - మీ మనస్సును వేరే విషయంపై పెట్టండి. వీడియో గేములు ఆడటం, నిద్ర వచ్చే చక్కటి మ్యూజిక్ వినటం వంటివి చేసి మీ మనస్సు ప్రయాణంపై ఆలోచించకుండా చేయండి.
దూదులు చెవికి పెట్టండి - చెవినొప్పులు, వినపడకపోవటం వంటివి ఎయిర్ సిక్ నెస్ వున్న వారికి తప్పని సరి. చెవులలో కలిగే శబ్దం, మీ సమస్యను ఎక్కువ చేస్తుంది. కనుక ఎయిర్ సిక్ నెస్, లేదా చెవి నొప్పులవంటివి రాకుండా వుండాలంటే సరిగ్గా విమానం బయలుదేరబోయే ముందు, చెవులలో దూదులు పెట్టుకోండి.
మౌత్ ఫ్రెషనర్స్ - బిజీగా వుండాలంటే ఇది మంచి ఆలోచన. మింట్ వంటివి నోటిలో వేసుకోండి. అవి మీకు హాయిభావన కలిగిస్తాయి. అల్లం లేదా ఉసిరి కాయ ముక్కలు వంటివి కూడా వాంతి భావన కలుగకుండా చేస్తాయి.
శారీరక కదలికలు పెంచండి - మంచి పాట వింటూంటే, మీ చేతులు, కాళ్లు ఆటోమేటిక్ గా కదలాలి. అదే విధంగా, మీరు విమానంలో ప్రయాణించేటపుడు మీ కాలి వేళ్ళు, చేతులు, చేతి వేళ్ళు ఆడించండి. దీనివలన మీ మైండ్ డైవర్ట్ అవటమే కాక కదలికల సమస్య కూడా పోతుంది.
నీరు తాగండి - విమానంలో మీరు బాగా లేరనుకుంటే, చల్లని నీటిని తరచుగా తీసుకోండి. పండ్లరసాలు లేదా రుచి, సువాసన కల ఇతర ద్రవాలు మీ మైండ్ ను మళ్ళిస్తాయి. మీకిష్టమైన డ్రింక్ ఏదైనా వుంటే, దానిని చప్పరిస్తూ ఎయిర్ సిక్ నెస్ దూరం చేసుకోండి.
ఈ చిన్నపాటి పరిష్కారాలు మీకు విమాన ప్రయాణ సిక్ నెస్ పోగొడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications