Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ప్రయాణానికి ముందు తినకూడని 7 ఆహారాలు...
సాధారణంగా వీకెండ్స్ లేదా లాంగ్ లీవ్స్ వచ్చినప్పుడు ఎక్కడికైనా ట్రిప్ వెళ్తామని చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే కొందరికి ప్రయాణాలంటే అసలు పడవు. బస్సెక్కితే చాలు వాంతులు చేస్తూ ఉంటారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ప్రయాణాలు కూడా మానుకుంటుంటారు. ఆ ఉత్సాహంలో ఆడ్రినల్ స్థాయి పెరిగి వివిధ రకాల ఆహారాలు తీసుకోవడానికి అత్యుచ్చాహం చూపిస్తారు. ఐతే ఏమైన జరుగుతుందేమో అన్న బయం చెందనవసరం లేదు. మీరు తీసుకొనే ఆహారాన్ని బట్టే ఆరోగ్య మరియు మానసిక ప్రభావం ఆధారపడి ఉంటుంది.
కొందరికి ప్రయాణాలంటే అసలు పడవు. బస్సెక్కితే చాలు వాంతులు చేస్తూ ఉంటారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ప్రయాణాలు కూడా మానుకుంటుంటారు. అయితే దీనికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. బస్సులో, కార్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందికి వాంతులు, వికారం, తలతిరగడం వంటి లక్షణాలు కలుగుతాయి. దీనిని మోషన్ సిక్‌నెస్ అంటారు. కొందరికి షిప్‌లలో ప్రయాణించేటప్పుడు కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి.
అందుకు ముందస్తు ప్రణాళిక అత్యంతావశ్యకం. కొత్త ప్రదేశాల్లో పడక, నిద్ర, విశ్రాంతి, మంచినీరు, ఆహారం, విహారం, అనుభవాల సంకలనం, ఆరోగ్యానికి మందులు, దుస్తులు, ప్రయాణంలో అత్యవసరమైన డబ్బు, కెమేరాలు అన్నీ ఆలోచించి ఓ పద్ధతి ప్రకారం అమర్చుకోవాలి. ఇవి కాకుండా పాటించవలసిన జాగ్రత్తలు ఎన్నో ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాం.

చీజ్ బిట్స్: స్నాక్స్ మీద చీజ్ ను తురుము అలంకరించిన ఫుడ్ చాలా ఆకర్షిస్తూ నోరూరిస్తుంటుంది. అయితే ప్రయాణానికి ముందు చీజ్ తో తయారైన ఆహారాలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. ఇంకా జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది. చీజ్ తో తయారైన ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా సమయం వరకూ కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. కాబట్టి ప్రయాణానికి ముందు చీజ్ తో తయారు చేసి స్నాక్స్, వంటకాలకు దూరంగా ఉండాలి.

ఫ్రై చేసిన ఆహారాలు: బర్గర్ మరియు ఇతర ఫ్రైడ్ స్నాక్ ప్రయాణికులకు బెస్ట్ చాయిస్ అంటారు. అయితే ఫాస్ట్ ఫుడ్స్ జీర్ణం అవ్వడానికి చాలా సమయం తీసుకొంటుంది. చీజీ హమ్ బర్గర్ తినడం వల్ల కడుపు నిండుగా అనిపంచడమే కాకుండా గ్యాస్ట్రిక్ సమస్యను ఏర్పరుస్తుంది. అంతే కాదు బాడీ వెయిట్ ను కూడా పెంచుతుంది.

సాఫ్ట్ డ్రింక్: ప్రయాణాలు చేసే వారు తప్పనిసరిగా సాఫ్ట్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతారు. ఇలా తాగడం వల్ల వారు సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు. అయితే ఇది చాలా తప్పు , కార్బోహైడ్రేటెడ్ బెవరేజస్ సోడా మరియు కోల్డ్ డ్రిక్స్ గాస్ట్రిక్ సమస్యను ఏర్పరుస్తాయి. ఇంకా నోటి దుర్వాసనకు దారి తీస్తుంది. కాబట్టి ప్రయాణంలో సాఫ్ట్ డ్రింక్ కు చెక్ పెట్టండి.

కృత్రిమ తీపిపదార్ధాలు: క్యాండీస్ మరియు చూయింగ్ గమ్స్ తినడం వల్ల మిమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచగలుగుతుంది. ఇందులో కృత్రిమ తీపిపదార్ధాలు కలిగిన క్యాండీస్ మీ దంత ఆరోగ్యానికి చాలా హానీ కలిగిస్తాయి. ఇక చూయింగ్ గమ్ నమలడం వల్ల నోటి నుండి కడుపులోని ఎక్కవ గాలి చొరబడి గ్యాస్ సమస్యకు దారితీస్తుంది.

కారంతో కూడిన ఆహారాలు: కారంతో తయారు చేసిన గ్రేవిలు తీసుకోవడం వల్ల కడుపులో మంట పుట్టిస్తుంది చాలా మంది ప్రయానికులు ప్రయాణంలో స్టొమక్ అప్ సెట్ట్ అవ్వడంతో చాలా బాధ పడుతుంటారు. కాబట్టి ప్రయాణానికి ముందు చాలా తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

నూడిల్స్: పిండి పదార్థాలు ఎక్కువగా కలిగినటువంటి నూడిల్స్, పాస్తా వంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది. పిండి పాదర్థాలు అధికంగా కలిగిన ఆహారాలు తినడం వల్ల కడుపు ఉబ్బరంగాను, గ్యాస్ తో ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రయాణానికి ముందుకానీ, ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ ఈ నోరూరించే వంటకాలను తినకుండా నివారించడమే మేలు.

ఆల్కహాల్: కార్బో హైడ్రేట్ ఆల్కహాల్ డ్రింక్స్ అయినటువంటి బీర్, సోడా, మరియు చాపేంజ్ వంటివి తాగడం వల్ల కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. కాబట్టి ప్రయాణానికి ముందు ఇటువంటి వాటిని దూరంగా ఉండండి.
ప్రయాణంలో అతిగా తినడం వల్ల అనారోగ్యానికి గురికావల్సి వస్తుంది. మీరు ప్రయాణించే వాహనాన్ని (ట్రైయిన్, కార్, బస్, విమానం)బట్టే ఆహారాన్ని తీసుకోవల్సి ఉంటుంది. కొన్ని ఆహారాలు పొద్దస్తమానం తినడం వల్ల గ్యాస్ సమస్య, కడుపు ఉబ్బరం వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకొనే కొన్ని ఆహారాలు మీ మూడ్ ను కూడా మార్చి వేస్తుంది ! కాబట్టి ప్రయాణానికి ముందు ఎటువంటి ఆహారం తీసుకోవాలో ముందే చెక్ చేసుకోవడం మంచిది.
మీరు గను ట్రైయిన్ లో ప్రయాణిస్తున్నట్లైతే ఎక్కువ దూరం ప్రయాణం చేయవల్సి వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అదే విమానంలో కనుక ప్రయాణించాలనుకొన్నప్పుడు మీకు కష్టమైన అనుభూతిని కలిగిస్తుంది కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో జాగ్రత్తవహించాలి. అదేవిధంగా కారులో ప్రయాణం చేసేటప్పుడు కూడా కార్ లోని పెట్రోల్ వాసనతో మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేస్తుంది. కాబట్టి ప్రయాణానికి ముందు తినకూడని కొన్ని ఆహారాలు నివారించాలి. ఒక వేళ అవి ఆరోగ్యానికి మంచివైనా సరే ట్రావెలింగ్ సమయంలో వాటికి దూరంగా ఉండటమే మంచిది. ముఖ్యంగా ప్రయాణాల్లో స్వల్ప ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన పానీయాలు మరియు నీళ్ళు, పండ్లు తీసుకెళ్ళడం చాలా మంచిది. మరి ట్రావెలింగ్ టైమ్ లో తినకూడని ఆహారాలేంటో చూద్దాం...



Click it and Unblock the Notifications











