Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
కళ్ళు అనారోగ్యానికి దారితీసే 7 అసాధారణ విషయాలు
కొన్నిసార్లు మనకు తెలయకుండానే మన కళ్ళు అలసటకు గురి అవుతుంటాయి. చాలా వరకు కళ్ళు అలసటకు కారణం కంప్యూటర్ స్ర్కీన్స్. నిజానికి దానికి కారణం అయ్యే ఒక సిండ్రోమ్ ఉంది దాన్నే కంప్యూటర్ ఐ స్ట్రెస్ అంటారు. కానీ అవన్నీ మనకు పట్టనట్టు బద్దకంతో మనమే ఇటువంటి చిన్న చిన్న సస్యలను అంతగా పట్టించుకోము. అయితే ఎప్పుడు ఐతే కళ్ళు ఒత్తిడికి గురిఅవుతాయో అప్పుడు కారణాలు అనేకంగా కనిపిస్తాయి. కళ్ళు మసకగా కనిపిస్తాయి అందుకు కంటి అద్దాలు అవరం.
ఒక వేళ అద్దాలు వాడుతున్నట్లైతే ఆ అద్దాల పవర్ వల్ల కూడా కళ్ళ మీద స్ట్రెస్ పెరుగుతుంది. దాంతో ఇతర సమస్యలు ఎదురవుతాయి. తలనొప్పి, కళ్ళ నొప్పులు, కళ్ళ మంటలు ఇలా . వైద్య పరిభాషలో ఆస్తనోఫియా అంటారు. కానీ ఈ అస్తనోఫియాకు ఎలా లక్షణాలు కనబడవు. అయితే మనం వాటిని తెలుసుకోవచ్చు అదేలాగో చూద్దాం....కళ్ళకు అలసటకు కారణం అయ్యే వాటిని కొన్నింటిని తెలుసుకుందాం...

1. పడుకొని పుస్తకాలు చదవడం: పుస్తక ప్రియులు, కొంత మంది ఉంటారు. వారు ఎన్ని పుస్తకాలు చదివినా తనివి తీరదు. వారు పడుకొని, కూర్చొని, లాన్ లో పడుకొని చదవడం వీరికి ఒక ఓ పిచ్చి హాబీ. అయితే పడుకొని చదడం కళ్ళకు అలసటకు గురి అవుతాయి. ఇది చూపును మరల్చుతుంది. దాంతో కళ్ళు మరింత చిట్లించి చూడటం లేదా చిన్నగానో, పెద్దగానో చూసి చదవడం వల్ల కళ్ల మీద మరింత ఒత్తిడి పడుతుంది.
2. కంప్యూటర్ ఐ స్ట్రెయిన్: రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల తప్పని సరిగా అలసటకు గురిఅవుతాయి. కళ్ళు మండుతాయ. తీవ్రనొప్పికి గురి అవుతాయి. ఇటువంటి సమస్యలనుండి బయటపడాలంటే తప్పనిసరిగా యాంటీ గ్లేర్ గ్లాసెసులను ఉపయోగించాలి.
3. టీవీ చూడటం: కంప్యూటర్ లాగే టెలివిజన్ స్ర్కీన్ కూడా. కాబట్టి టీవీ చూసే సమయంలో సాధ్యమైనంత వరకూ మినిమం డిస్టెన్స్ లో చూడాలి . లేదంటే రోజంతా ఇలాగే ఎక్కువ అలసటకు గురికావల్సి ఉంటుంది.
4. ప్రయాణంలో బుక్ రీడింగ్: ప్రయాణంలో బుక్ చదవడం కూడా కళ్ళకు హానీ కలిగిస్తుంది. అది కారులో కానీవ్వండి లేదా ట్రైయిన్ లో కానీవ్వండి ఇది చెడ్డ అలవాటు. చదివేటప్పటుడు వాహనాలు ఇటు అటుగా వెళ్ళినప్పుడు కాన్ సన్ ట్రేషన్ మరలుతుంది. అప్పుడు కూడా కళ్ళ మీద ఎక్సాట్రా స్ట్రెయిన్ పడుతుంది.
5. ఎండ: కళ్ళకు ఎటువంటి రక్షణ లేకుండా ఎండలో అలాగే బయట తి రగడం వల్ల కూడా కళ్ళు అలసట చెంది, కళ్ళ క్రింద ముడుతలు ఏర్పడుతాయి. అంతే కాకుండా సూర్యకిరణాల్లో ఉండే ఆల్ట్రావయోలెట్ కిరణాలు కళ్ళకు చాలా హానీ కలిగిస్తాయి. కళ్ళ వెంబడీ నీరు కారేలా చేస్తాయి.
6. రాత్రి సమయంలో డ్రైవింగ్: కళ్ళు అలసిపోవడానికి నైట్ డ్రైవింగ్ కూడా ఒక కారణం. రాత్రి సమయంలో ఎక్కువగా హైవేలో డ్రైవ్ చేయడం వల్ల మరుసటి రోజు ఉదయానికి కళ్ళు ఎర్రబడి అందవిహీనంగా ఉండి కళ్ళు మండుతుంటాయి.
7. నీడిల్ వర్క్: ఆశ్చర్యం కానీ ఇది నిజం. నీడిల్ వర్క్ (సూదితో కుట్లు మ రియు అల్లికలు వేయడం వల్ల కూడా కళ్ళు అలసటకు గురి అవుతాయి. సూదితో కుట్లు కుట్టడానికి ప్ర్యేతేకమైన కాంసెంట్రేషన్ ఉండాలి. కళ్ళమీద ఎక్కు ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి కళ్ళకు అలసటను, ఒత్తిడిని కలిగించే ఇటువంటి వాటికి దూరంగా ఉండటం ఎంతైన అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
