Latest Updates
-
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు -
చుక్క నూనె లేకుండా పాపడ్, చిప్స్ వేయించొచ్చు..సెలబ్రిటీ చెఫ్ సీక్రెట్ ట్రిక్! -
గుండె పదిలం, కండరాలు దృఢం.. 30 ఏళ్లు దాటిన మగవాళ్లు రోజూ తినాల్సిన అద్భుతమైన గింజలివే -
అసిడిటీకి చెక్ పెట్టే, గట్ హెల్త్ పెంచే హెల్తీ స్నాక్..ఈ బ్రాహ్మణ స్టైల్ అరటిపువ్వు వడ ట్రై చేయండి! -
చింతపండులో ఇంత మ్యాటర్ ఉందా? తింటే ఏమవుతుందో తెలుసా? -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ నల్లి గోష్ట్ బిర్యానీ.. ఈ సర్ప్రైజ్ కి ఫ్యామిలీ ఫిదా! -
రెస్టారెంట్ స్టైల్ మాకరోనీ సలాడ్.. ఇప్పుడు మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
ఓట్ మీల్ ఆరోగ్య ప్రయోజనాలు!

ఈ గింజధాన్యాలు కడుపు నింపటమే కాకా, కేలరీలు కూడా తక్కువగానే వుంటాయి. వాటిలో ఓట్ మీల్ తప్పక తినవలసిన ఆహారమే. మరి ఓట్ మీల్ అందరికి ఇష్టమైనదిగా ఏ రకమైన ప్రయోజనాలు కలిగివుందో పరిశీలించండి.
ఓట్ మీల్ ఆరోగ్య ప్రయోజనాలు
అన్నిటికంటే గొప్ప ప్రయోజనం అంటే దానిని క్షణాలలో తయారు చేయవచ్చు.
పనిలోకి తొందరగా వెళ్ళే వారు మైక్రోవేవ్ లో ఓట్ మీల్ తయారు చేసి రెడీగా తినేయవచ్చు. స్టవ్ పైన కూడా పది నిమిషాలతో తయారైపోతుంది. రీసెర్చర్ల మేరకు, దీనిలోని కరిగే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొల్లెస్టరాల్ తగ్గిస్తాయి. చెడు కొల్లెస్టరాల్ గుండె వ్యాధులను ప్రత్యేకించి పోటు కలిగించే బ్లాకులను రక్తనాళాలలో తగ్గిస్తుంది.
ఓట్లు రెగ్యులర్ గా తింటే చెడు కొల్లెస్టరాల్ నిలువ వుండదు.
దీనిలో వుండే పీచు పిండి పదార్ధాల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇది రక్తంలోని షుగర్ నిల్వలు నియంత్రిస్తుంది. డయాబెటిక్ రోగులకు మంచి ఆహారంగా అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ సిఫార్సు చేసింది.
రక్తపోటు, ఒత్తిడి తగ్గించుకోదాడనికి ఓట్ మీల్ తినవచ్చు. అన్నం, గోధుమ, మొక్కజొన్న వంటి ఆమారాలతో పోలిస్తే వీటిలో ఫైటో కెమికల్స్, మెగ్నీషియం మరియు కరిగే పీచు వంటివి అధికం. కేన్సర్ రాకుండా చేస్తాయి. శరీరంలోని విషపదార్ధాలను తొలగిస్తాయి.దీనికి కారణం ఇందులో వుండే కరిగే పీచు అని చెప్పాలి. ఉదయంవేళ అల్పాహారంగా ఓట్లు మంచి ఆహారం అని పోషకాహార నిపుణులు సలహానిస్తారు.
ఓట్లు ఎక్కువ రుచి కలిగి వుండవు కనుక వాటిని రుచిగా చేయాలంటే
- పాలలో కలిపి తినాటి. ఇందులో వుండే పీచు మీ కడుపు బాగా నింపి త్వరగా మరల ఆకలి కాకుండా చేస్తుంది. కనుక వెన్నతీసిన పాలలో ఓట్లు వేసుకొని తినండి.
- తీపి ఇష్టపడే వారైతే, ఓట్లను తేనెలో వేసుకొని కూడా తినవచ్చు. షుగర్ కు బదులుగా తేనె వాడితే మంచి పోషకాలను కూడా పొందే అవకాశం వుంటుంది. తేనెలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
- మరో రకంగా ఓట్లను పండ్లతో కూడా కలిపి, అందులో తగుమాత్రం పాలు తేనె వేసి కూడా తినవచ్చు.
- ఓట్లతో ఎండు ఫలాలు కూడా కలిపి తింటే రుచిగానే వుంటాయి. బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్ మిస్ వంటివి ఓట్లతో కలిపితే రుచికరంగా వుంటాయి.
- ఓట్లను పెరుగు తో కూడా కలిపి తినవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications