Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
కుండలాంటి బొజ్జ...పొట్టంతా కొవ్వు!
బీరు తాగుతూ పొట్ట పెంచుతున్నారా ? చురుకుదనం పోతుంది. జాగ్రత్త! పార్టీలు తగ్గించుకోండి, లైఫ్ స్టైల్ పెంచండి, పోయిన ఫిట్ నెస్ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఒక్క సారి పొట్ట పెరగటం మొదలెడితే, దాని ఎదుగుదల ఆపటం కష్టం. ఈ సమస్య మగవారికే కాదు, ఆడవారికి సైతం వుంటుందంటున్నారు పోషకాహార నిపుణులు. నేటి రోజులలో మహిళలలో సైతం కారణం ఏదైనప్పటికి శరీర బరువులు అధికం అవుతున్నాయి.
సాధారణంగా ఒక సారి బీర్ తాగడం మొదలు పెడితే, ఒక్కొక్కరూ కనీసం రెండు లేదా మూడు బాటిల్స్ అయినా సరే తాగనిదే బయటపడరు. ఒక్క సారి పొట్టకు కొవ్వు చేరుకుంటే ఇక మీ స్మార్ట్ నెస్ అంతా ముగిసినట్లే. మీ చురుకుదనాన్ని పోగొట్టే వ్యాధులైన డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొల్లస్టరాల్ లాంటి సమస్యలు ఎన్నో వస్తాయి. కనుక నిపుణుల మేరకు బీర్ ప్రతిరోజూ రెగ్యులర్ గా తాగకుండా బీరు తాగే వారు ఆచి తూచి దానిని తాగడం మంచిది. బీరు సగటున 350 ఎంఎల్ కు 155 కేలరీల శక్తి ఇచ్చేస్తుంది.

బరువు సరి చూసుకోండి. బీరుకు స్వస్తి చెప్పండి. రెండు గ్లాసుల బీరు 300 కేలరీలు ఇచ్చేస్తుంది. దానితో పాటు తీసుకునే పిజ్జాలు, చిప్స్ లాంటి వాటికంటే బీరు అధికంగా కేలరీలు చేరుస్తుంది. కనుక మీకు పొట్ట రావటం కావాలా లేక బీరు వదులుకోడం కావాలా అనేది ఒక్కసారి మీ పెరిగిన బరువు చూసి నిర్ణయించుకోండి.
అయితే, కొద్దిపాటి లైఫ్ స్టైల్ మార్పులు, ఒక చిన్న వ్యాయామ ప్రణాళిక మీ బీరు పొట్టను తేలికగానే తగ్గించేయగలవని కూడా నిపుణులు చెపుతున్నారు. ప్రధానంగా ఆచరించాల్సింది డైటింగ్ కాగా తర్వాతి స్ధానం వ్యాయామానిది. తిండి తగ్గిస్తూ మరోపక్క కేలరీలు బర్న్ చేయాలంటారు వీరు. మరోమారు శరీరం చక్కటి షేప్ లోకి రావాలంటే సంతులిత ఆహారం అంటే బేలన్సు డైట్, తగిన వ్యాయామాలు చేయాలంటారు.
మీరు తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు ముఖ్యమైనవి. ఆల్కహాల్ ఎంత తక్కువ తాగితే అంత మంచిది. ఆహారం కొద్ది కొద్దిగా ఎక్కువమార్లు తీసుకోండి. సాయంత్రం ఆరు గంటలపైన ఎట్టి పరిస్ధితులలోను కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు. అసలు మీ రాత్రి భోజనం వంటివి కూడా మరీ పొద్దుపోకుండా ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా తినేయండి. ఈ మార్పులు తక్షణ ఫలితం చూపకపోయినా, ఆచరిస్తూ వుంటే మార్పు కనపడుతుంది. ఇక అపుడపుడూ బార్ కి వెళ్ళి బీర్ ఓ గ్లాస్ కొట్టేసినా ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications