Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
తాజా....తాజా... తాగితే ఒత్తిడి మాయం....?
నేటి రోజులలో ఒత్తిడి ప్రతి ఒక్కరిని అలసిపోయేలా చేస్తోంది. ఎన్ని ఆహారాలు తిన్నప్పటికి ఒత్తిడి కారణంగా అవన్ని మనలను నీరసించేలానే చేస్తూంటాయి. ప్రత్యేకించి చాలామంది ఉదయంనుండి సాయంత్రం వరకు ఆఫీసుల్లో పనిచేసి అలసిపోతూంటారు. ఉదయం 11 గంటలకు ఒక కాఫీ లేదా సాయంత్రం 4 గంటలకు ఒక టీ వంటివి ఎప్పటికపుడు శక్తి పొందేందుకు తాగి పని చేస్తూంటారు. కాఫీలు, టీల వంటివి తాత్కాలికంగా మనలోని శక్తిని పెంచి పని చేసేలా చేసినప్పటికి, వాటి ప్రభావంగా మరల సాయంత్రం అయ్యే సరికి అలసిపోక తప్పదు.

ఆఫీస్ లో విసుగు, అలసట వంటివి మిమ్మల్ని సరిగా పనిచేయనివ్వవు. ఈ కారణంగా వీరు తాము చేసే ఆఫీస్ పనిపై ఎన్నో ఫిర్యాదులు చేస్తూంటారు. ఆఫీసు పనికి అయిష్టం చూపుతారు. ఆఫీస్ లో సాయంత్రం అయ్యే సరికి కొంతమంది మరుసటిరోజు సెలవు పడేయాలనే భావనలు కూడా కలిగి ఉంటారు. ఒత్తిడి ఈ స్ధాయిలో వారిపై ఉంటుంది. అయితే, తాజాగా సైంటిస్టులు వీరిపై అధ్యయనం చేశారు. 500 మి.లీ. దానిమ్మ గింజల రసాన్ని ప్రతిరోజూ కార్యాలయాలకు వెళ్ళి పని చేసే వారికి ఇచ్చినట్లయితే, వారు అలసిపోరని, వారు చేసే పనిపై మరింత ఇష్టాన్ని కూడా చూపుతున్నారని పరిశోధన తెలిపింది.
దానిమ్మ గింజల రసాన్ని షుమారుగా రెండు వారాలపాటు నిరంతరంగా వీరికి అందించారని తెలిసింది. రెండు వారాల తర్వాత వారు కార్యాలయ పని అంతా పూర్తయిన తర్వాత వారికి ఒక ప్రశ్నా పత్రం అందించారు. అందులో చాలామంది ఉద్యోగులు వారు చాలా హేపీ భావిస్తున్నట్లుపని ఒత్తిడి భావించకుండా వున్నట్లు, చురుకుగాను, ఎంతో గర్వంగాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ రీసెర్చిని ఒక పోమోగ్రానేట్ జ్యూస్ కంపెనీ నిర్వహించింది
అంతే కాదు, పరీక్షలు చేయిస్తే పని సమయంలో వారి పల్స్ రేట్ సైతం పెరగకుండా ఎంత వుండాలో అంతేవుందట. ఫలితంగా పరిశోధకులు వర్కర్లు లేదా ఉద్యోగులు, తీవ్ర ఒత్తిడినుండి దూరమవాలంటే, పోమోగ్రానైట్ జ్యూస్ తాగమని సలహాలిచ్చారట. ఒత్తిడే కాదు దీనివలన గుండెతో సహా ఆరోగ్యానికి ఇతర ప్రయోజనాలు ఎన్నో వున్నాయని కూడా క్వీన్ మార్గరెట్ యూనివర్శిటీలోని రీసెర్చి లీడర్ డా. ఎమాద్ అల్ దుజైలి తెలిపినట్లు డెయిలీ మెయిల్ వార్తా పత్రిక పేర్కొంది. ఎన్నో ప్రయోజనాలను అందించే దానిమ్మ రసానికి ఒత్తిడి అనే కొద్దిపాటి లేదా కొద్దిపాటి ప్రయోజనాలు మాత్రమే ఆపాదించటం సరికాదని తాము భావిస్తున్నట్లుగా కూడా రీసెర్చర్లు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications