Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లేటుగా నిద్ర లేస్తే... ?

1. త్వరగా నిద్ర లేచే వారికి రాత్రి డిన్నర్ సమయం 7 గంటలుగా అనుకుంటే వారు నిద్రించే సమయం 9 గంటలు లేదా 10 గంటలుగా వుంటుంది. వీరికి తిన్న ఆహారంలో 90 శాతం నిద్రించేసమయానికి జీర్ణమైపోతుంది. లేదంటే అజీర్ణం, కొవ్వుపట్టడం వంటివి వుంటాయి.
2. నేటి జీవన విధానంలో చాలామందికి 9 నుండి సాయంత్రం 6 గంటలవరకు పనిచేసే ఉద్యోగాలు లభించటం లేదు. వీరు రాత్రులందు లేట్ గా పని చేయాలి. మరి ఈ రకంగా పని చేసిన వారికి రోజుకు 8 గంటల నిద్ర వుంటే గాని సరైన విశ్రాంతి లభించదు. కనుక ఉదయంవేళ తగినంత అధిక సమయం నిద్రించాల్సిందే.
3. సాఫ్ట్ వేర్, కంప్యూటర్ ఉద్యోగస్తులు కంప్యూటర్లపై చాలా సమయం పని చేస్తారు. వారి కళ్ళు, మెదడు బాగా అలసిపోతాయి. వారు ఇంటికి ఏ సమయానికి వచ్చినప్పటికి వారికి ప్రధానంగా 8 గంటల నిద్ర కావలసిందే.
4. విద్యార్ధులకు, ప్రత్యేకించి పరీక్షలలో పొద్దుపోయే వరకు చదివితే పరీక్షలు బాగా వ్రాస్తామనే నమ్మకం వుంటుంది. నిద్రించే ముందుగానే వారి సిలబస్ చదివేసి ఉదయం లేటుగా లేచి పరీక్షలు వ్రాసి పాసైన వారు ఎంతోమంది వున్నారు. పెందలకడే లేచి చదివి పాసైనవారు కూడా వున్నారు.
5. మధ్యాహ్నం సమయంలో నిద్రించేకంటే ఉదయం వేళ ఆలస్యంగా లేచి రాత్రివరకు పనులు చక్కబెట్టుకుంటే కూడా బాగానే వుంటుంది. మధ్యాహ్నం నిద్ర తర్వాత లేస్తే అంతా డల్ గానే అనిపిస్తుంది. ఆరోగ్యం అంటూ శరీరాన్ని బలవంతం పెడితే అది మీ ఆనందాన్ని పాడు చేయగలదు. కనుక మీ అవసరాలనుబట్టి తగినంత నిద్రించి ఆనందించడం కూడా మంచిదే.
పిల్లలకు 10 సంవత్సరాల వరకు కనీసం అంటే 10 గంటల మంచి నిద్ర కావాల్సిందే. కనుక వారిని ఆరోగ్యం అంటూ అనవసరంగా బాధించకండి. వారికి కావలసినంత సమయం హాయిగా నిద్రింపజేసి వారి మెదడు రోజు రోజుకు వికసించటం గమనించి ఆనందించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications