Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు -
చుక్క నూనె లేకుండా పాపడ్, చిప్స్ వేయించొచ్చు..సెలబ్రిటీ చెఫ్ సీక్రెట్ ట్రిక్! -
గుండె పదిలం, కండరాలు దృఢం.. 30 ఏళ్లు దాటిన మగవాళ్లు రోజూ తినాల్సిన అద్భుతమైన గింజలివే -
అసిడిటీకి చెక్ పెట్టే, గట్ హెల్త్ పెంచే హెల్తీ స్నాక్..ఈ బ్రాహ్మణ స్టైల్ అరటిపువ్వు వడ ట్రై చేయండి!
భుజాల నొప్పికి కారణాలు... చికిత్స ఎలా?

కీళ్ళ అరుగుదల కావచ్చు.
కొన్ని మార్లు కీలు అరిగి ఎముక బలహీనపడుతుంది. దీనికి కారణం అరుగుదలే. జాయింట్లలో ఉండే కార్టిలేజ్ అనే మెత్తటి పదార్ధం కొరత పడుతుంది. కార్టిలేజ్ అనే ఈ పదార్ధం మెత్తగా ద్రవంవలే ఉంటుంది. అది జాయింట్ల వద్ద కదిలేటపుడు వేడి పుట్టకుండా, నొప్పి లేకుండా చేస్తుంది. ఈ కార్టిలేజ్ కనుక అరిగి ఖాళీ అయిపోతే, ఎముకలు ఒకదానికొకటి టచ్ అవుతూ నొప్పి పెడతాయి. గట్టిపడిపోతాయి. దీనినే కీళ్ళ అరుగుదల అని అంటారు.
కీళ్ళ జబ్బులనుండి బాధ పడేవారు భుజంలో గట్టితనం, నొప్పి కలిగి ఉంటారు. కొద్దిపాటి వాపు, ఉబ్బటం వంటివి కూడా జాయింట్లలో కనపడుతుంది. కొన్ని కేసులలో రోగులు తమ భుజం బాగా బలహీనపడి ఎత్తలేని స్ధితిలో కూడా ఉంటారు.
రుమటాయిడ్ ఆర్ధరైటిస్
ఈ విషయంలో శరీరం తన రోగ నిరోధకతను కోల్పోతుంది. ఫలితంగా బలహీనపడుతుంది. జాయింట్ల లో ఉండే లైనింగ్ దెబ్బతింటుంది. మెత్తటి కణాలను ఈ వ్యాధి నష్టపరుస్తుంది. భుజమంతా మంట, నొప్పి కలిగి ఉంటుంది. ఇది చాలా నిదానంగా వచ్చే వ్యాధి అయినప్పటికి ఇది వచ్చిన వారికి అలసట, బలహీనత, ఫ్లూ జ్వరం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. కొద్దిపాటి జ్వరం, డిప్రెషన్ కళ్ళు, నోరు పొడిబారటం ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. భుజంలో చురుక్కు చురుక్కుమంటూ నొప్పులు వస్తాయి.
కొన్ని మార్లు ఏదేని యాక్సిడెంట్లవంటివి జరిగి ఎముకలు కార్టిలేజ్ సరిగా ఏర్పడకపోతే అది భుజంలోని ఎముకల అరుగుదలకు దోవతీసి నొప్పి మంటలు కలిగిస్తుంది. కొన్ని మార్లు మీకు ఇటీవలే సర్జరీలు జరిగి కూడా భుజం పట్టేయవచ్చు. డయాబెటీస్, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులు, లేదా రుమటాయిడ్ ఆర్డరైటిస్, గుండె జబ్బులు కలిగిన వారు లేదా ఏదేని యాక్సిడెంట్లకు గురైనవారు అధికంగా ఈ ఫ్రోజెన్ షోల్లడర్ అంటే భుజం ఎముకలు గట్టిపడిపోవటం అనే వ్యాధికి గురవుతారు. వీరు తమ భుజాలతో చిన్నపాటి కదలికలు అంటే, కనీసం భుజాన్ని ఎత్తటం కూడా చేయలేరు.
ఇటువంటపుడు వెంటనే వైద్య చికిత్స అవసరం అవుతుంది. నొప్పి బాగా ఉంటే, లేదా మెడ నొప్పి వంటివి చేతులు, కాళ్ళలోకి చేరుతూంటే, వెంటనే వైద్యులను సంప్రదించాలి. జ్వరం, వెలుగు చూస్తే వాంతి వికారాలు కలగటం వీరికి ఉంటుంది. భుజానికి రోజులో కనీసం 4 నుండి 8 సార్లు చల్లని ఐస్ ముక్కలను తాకించాలి.
తలగడలు ఉపయోగించి మీ భుజం కొద్దిపాటి ఎత్తులో ఉండేలా చేయండి. దానితో నొప్పి, వాపు తగ్గే అవకాశం ఉంటుంది. నొప్పికి టూలినాల్ లేదా ఇబుప్రోఫెన్ వంటి మందులు వేసుకోండి. వెంటనే ఎక్స్ రే తీయించండి. ఒకటి రెండు రోజుల చికిత్స తర్వాత సాధారణ కదలికలు చేయవచ్చు. కొన్నిసార్లు భుజం సమస్యలు తగ్గించాలంటే, 90 శాతంమందికి చిన్నపాటి వైద్యాలు సరిపోగా మరికొందరికి శస్త్ర చికిత్సలు కూడా చేయాల్సి వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications