Latest Updates
-
ఫోన్ పాస్వర్డ్లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్ -
పెళ్లై ఏళ్లు గడిచాక చాలా జంటలు భార్యాభర్తలుగా కాదు, రూమ్మేట్లలా జీవిస్తున్నారు మీరూ ఇలాంటివారేనా? -
మీ రాశి చక్రం ప్రకారం పడక గదిలో ఏ కలర్ పెయింటింగ్ వేస్తే మంచిదో తెలుసా.? -
రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు! -
ఈ ఫ్రూట్తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్ఫుల్.! -
లక్ష్మీదేవి సముద్రం నుండి ఎందుకు పుట్టింది? దాచిన పురాణ కథ
ఉడికించని ఆహారాలు - శరీర ఆరోగ్యం!
మీరు కనుక పచ్చి కూరల ఆహారం తీసుకోవాలని ప్రణాళిక చేస్తూంటే, అవి మీ శరీర ఆరోగ్యానికి సరిపడతాయా ? లేదా అనేది పరిశీలించాలి. మీరు తినే ఆహారంలోని పోషకాలు పచ్చివిగా మీరు జీర్ణం చేసుకోగలరా అనేది ఆలోచించాలి. బాగా తయారు చేసిన పచ్చి కూరల ఆహారాలు సహజంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలిస్తాయి. ముందుగా మీరు వాటి పట్ల మంచి అవగాహనకలిగి అవి ఎలా పనిచేస్తాయి, మీకు ఎలా ప్రయోజనం ఇస్తాయి అనేది తెలుసుకోవాలి. అపుడే మీరు వాటి నుండి ప్రయోజనం పొందగలరు. కనుక పచ్చి కూరల ఆహారం తీసుకోవటంలో ప్రయోజనాలు పరిశీలించండి.

పచ్చి కూరల ఆహారం తయారీ అంటే, వీలైనంత మేరకు సేంద్రీయ ఎరువుల వాడకంతో, తయారైన కూరలు, పండ్లు మొదలైనవి ఉన్నవి ఉన్నట్లుగా అంటే ఉడికించటం లేదా ఇతర రకాలుగా ప్రాసెస్ చేయడం వంటివి చేయకుండా తినాలి. మీరు రోజువారీ తినే ఆహారంలో కనీసం 75 శాతం ఆహారం ఈ రకమైన పచ్చి ఆహారై ఉండాలి. మిగిలిన 25 శాతం ఆహారం ఉడికించినదై ఉండవచ్చు.
ఆహారాలను ఉడికిస్తే, వాటిలోని పోషకాలు, అధిక టెంపరేచర్ కారణంగా నశిస్తాయని, విలువైన ఎంజైములు పోతాయని పచ్చి కూరల ఆహారాల ప్రియులు లేదా పోషకాహార నిపుణులు చెపుతూంటారు. ఈ రకమైన పచ్చి కూరల ఆహారాలు తీసుకునేముందుగా మీరు మీ డైటీషియన్ ను సంప్రదించండి. వారు మీ శరీర ఆరోగ్యం, వైద్య పరిస్ధితి, వయసు, మీ వ్యాయామ నియమాలు మొదలైనవి పరిశీలించి పచ్చి ఆహారం తినవచ్చా లేక తినరాదా? అనేది చెపుతారు.
మీరు పచ్చి కూరల ఆహారాలు తినేముందు దానికి సంబంధించిన సమాచారాన్ని ఆన్ లైన్ లో గాని లేక అవి తినేవారినుండి గాని సేకరించాలి. ముందుగానే ఒకేసారి అధిక మొత్తాలలో తినకండి. అదే విధంగా ఒకే సారి దీర్ఘ కాలంలో వీటిని ప్లాన్ చేయకండి. కొద్ది కొద్ది మొత్తాలలో తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు అంటే కేరట్ వంటివి ముందుగా తినడం మొదలు పెట్టండి. దానితో మీ జీర్ణ వ్యవస్ధ మెల్లగా వాటికి అలవాటు పడిన తర్వాత వాటి పరిమాణాలను పెంచి అధిక రోజులు కొనసాగించండి. దీనికి సంబంధించిన ఇతర నిబంధనలు అంటూ ఏమీ లేవు. ఇవి కలుషితం లేని ఆహారాలు కనుక సహజంగా మీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.
మీరు తీసుకోవలసిన పచ్చి ఆహారం ఎక్కడ దొరుకుతుందనేది ముందుగా తెలుసుకోండి. అవసరం అనుకుంటే ఆ ఆహారాలను మీ పెరటిలో ఎరువులు వేయకుండా సహజంగా పెంచండి. పచ్చటి కూరలు, దుంప కూరలు, తాజా కూరలు మీ ఫ్రిజ్ లో నిలువ ఉంచండి. డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు అంటే ఖర్జూరాలు, కిస్ మిస్ లు, బాదం, అక్రోట్, వాల్ నట్, పైనాపిల్, కొబ్బరి, అప్రికాట్, మామిడి పండ్లు, యాపిల్స్, బాదం పాలు వంటివి కూడా ప్రతిరోజూ తిని మీ ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications