Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
బరువు తగ్గే ఆహార విధానాలు!

బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువుతగ్గుతారు అనేది ఒక అపోహ. వాస్తవం ఏమంటే, రీసెర్చర్ల మేరకు ఉదయంవేళ ఆరోగ్యకర ఆహారం తీసుకునేవారు త్వరగా బరువు ఎక్కరు. దీనికి కారణం రోజులో తర్వాత సమయంలో వారికి ఆకలి తక్కువగా వుండి తక్కువ తింటారు. బ్రేక్ ఫాస్ట్ వారి మెటబాలిజం పెంచుతుంది రోజువారీ దినచర్యలకు అవసరమైన శక్తినిస్తుంది. కనుక సంతులిత ఆహారాల బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. షుగర్ కేలరీలు, కొవ్వు ఉదయంవేళ ఆహారంలో అధికంగా వుండరాదు.
చాలామంది తాము లావు ఎక్కటానికి కారణం జీన్స్ అని భావిస్తారు. ఇది ఒక అపోహ మాత్రమే. వాస్తవంలో మీ జీన్స్ ఏవైనప్పటికి బరువు సంతరించుకోవడమనేది అధికంగా తినడం, కేలరీలు అవసరమైనవాటికంటే అధికంగా తీసుకోవడం వలననే వస్తుంది. కనుక ఆరోగ్యకరంగా తింటూవుంటే ఎంత బరువు వుండాలో అంతే వుండటానికి సహకరిస్తుంది.
రాత్రులందు ఆలస్యంగా తింటే బరువు పొందుతారనేది ఒక అపోహ. అనారోగ్యకర ఆహారాలు ఎపుడు తిన్నప్పటికి అధిక బరువు పొందుతారనేది గ్రహించండి. రాత్రులందు తిన్నప్పటికి అధికంగా కాకుండా, తేలికగా జీర్ణమయ్యే ఆరోగ్యకర ఆహారాలు మీరు బరువు ఎక్కకుండా చేస్తాయి. అయితే, ఆలస్యంగా తినకుండా వుంటే అది మీ గాఢనిద్రకు సహకరిస్తుంది. రాత్రులందు గాఢ నిద్ర పోయే వారు త్వరగా బరువెక్కే అవకాశం తక్కువని రీసెర్చి తెలుపుతోంది.
గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారనేది ఒక అపోహ కాకపోయినప్పటికి, దాని ఫలితం కనపడాలంటే, హాని చేసే ఇతర ఆహారాలు తినరాదు. ఎంత టీ తాగినప్పటికి మీరు తినకూడని పదార్ధాలు తింటూ వుంటే టీ ఫలితం వుండదు. అధిక బరువు సంతరించుకుంటారు. అయితే, తీపిలేని గ్రీన్ టీ తక్కువ కేలరీలు కలిగి మీకు ప్రయోజనంగా వుంటుందనేది గుర్తుంచుకోండి. అయితే, హెర్బల్ టీ తయారు చేసేటపుడు దానిలోని చేదును తొలగించటానికి మరిగిన వేడినీటిని వాడండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
