Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అనారోగ్యాల మసాలా ఆహారాలు ?
చాలామంది తమ రోజువారీ ఆహారంలో అధికంగా మసాలాలు వాడేస్తూ ఉంటారు. మసాలా దినుసులు, రుచిని మంచి వాసనలను కలిగిస్తాయనేది వాస్తవమే. వీటితోపాటు కొన్ని పొట్ట సమస్యలు కూడా ఈ మసాలా ఆహారాలు కలిగిస్తాయి. కొన్నిమార్లు ఎంతో ఇబ్బందిపెడతాయి. అయితే, వేయించని లేదా వాటి రూపం మార్చని కొన్ని దినుసులు లో విటమిన్లు మరియు మినరల్స్ కూడా ఉంటాయి. కాని వీటిని అధికంగా తింటే కూడా జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. అంటే మీరు ఇక మసాలా ఆహారాలు తినరాదని కాదు. తప్పకుండా తినవచ్చు. కాని తక్కువ పరిమాణంలో తినాలి. అపుడు అవి ఏ రకమైన పొట్ట సమస్యలు లేదా జీర్ణక్రియ సమస్యలు కలిగించవు. మసాలాలు ఏ రకమైన అనారోగ్యం కలిగిస్తాయనేది పరిశీలిద్దాం.
పొట్ట నొప్పి - మసాలా ఆహారాలలో యాసిడ్లు అధికం కనుక అధికంగా తింటే పొట్ట నొప్పి వస్తుంది. అవి మీ పొట్ట గోడలనను లేదా అంచులను నష్టపరచి, మంట కలిగిస్తాయి. ప్రత్యేకించి మిరపకాయలలో ఉండే కెప్సాసిన్ పదార్ధం నొప్పిని తాత్కాలిక అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పొట్ట గోడలకు వెంటనే తాకుతుంది. అందుకనే మసాలా దినుసుల ఆహారాలు జీర్ణక్రియ సమస్యలు తెస్తాయి. హానికరమైన ఈ కెప్సాసిన్ యాసిడ్ ను నల్లులు, క్రిమికీటకాలను చంపటానికి తోటలలో ఉపయోగిస్తారు. యాసిడ్ సమస్యలు కలిగించటమే కాక, అది ఆకలి సమస్యలు కూడా మీకు తెచ్చి పెడుతుంది.

గ్యాస్ట్రిక్ అల్సర్ - మసాలా ఆహారాలు చిన్న పేగులలో పుండు కలిగిస్తాయి. దీనినే డియోడినల్ అల్సర్ అని కూడా అంటారు. మీ ఆహారంలో మసాలాలు అధికం అయితే, అది గొంతోలో కూడా పుండు కలిగిస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్ ఏర్పడిందనే సూచనగా మీకు పొట్ట నొప్పి, వాంతి, వికారం వంటివి కలుగుతాయి. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. మసాలాలలోని రసాయనాలు, కడుపులో పుండును మరింత మంట మండిస్తాయి. కొన్నిమార్లు రక్తం కూడా రావచ్చు. కనుక మీరు ఇటువంటి అనారోగ్యాలను పొందకుండా ఉండాలంటే మసాలా ఆహారాలు పూర్తిగా మానేయాలి.
పొట్టలో పుండ్లు - కడుపులో పుండ్లకు కారణం పొట్ట మండటం, పొట్టలోని లైనింగ్ దెబ్బతినటం. పొట్ట మసాలా ఆహారాలు తీసుకుంటే మండుతుంది. అజీర్ణం ఏర్పడుతుంది. పొట్ట నొప్పి, ఎక్కిళ్ళు రావటం, మలం నల్లగా బయటకు రావటం, లేదా విరేచనం సాఫీగా కాకపోవటం జరుగుతుంది. ఈ లక్షణాలు కనపడితే, తప్పక డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకోండి. ఈ మసాలాలు అధికం అయితే, కొద్ది జ్వరం, లేదా ఆకలి తగ్గిపోవటం కూడా జరుగవచ్చు.
మసాలా దినుసులు ఎంత రుచికరం అయినప్పటికి, వాటిని ఔషధంగా మాత్రమే గతంలోని వంటకాలలో వాడేవారు. కాని వాటిని నేడు రుచి, వాసనల కొరకు వంటకాలలో ధారాళంగా వాడి ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. కనుక మసాలాలు మీ ఆహారంలో మితంగా వాడి వాటి రుచిని ఆనందించండి. మీ అనారోగ్య సమస్యలకు ఔషధాలుగా వాడి వాటిని సరిచేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications