Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పొగతాగటం మానాలంటే ఎలక్ట్రానిక్ సిగరెట్!
ఎలక్ట్రానిక్ సిగరెట్లనే.. ఇ - సిగరెట్లు అని కూడా అంటారు. సిగరెట్ తాగడం మానేయాలనుకునేవారికి ఇ సిగరెట్ ఒక వరం అనే చెప్పాలి. మీరు ఛైన్ స్మాకర్ అయివుండి మనసు మార్చుకొని ఇకపై సిగరెట్ తాగరాదని నిర్ణయించుకుంటే సైన్స్ తాజాగా కనిపెట్టిన ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ ఉపయోగించి సంతోషంగా సిగరెట్ మానేయండి. మనలో చాలామంది ఈ అలవాటుకు బానిసై కాలుస్తూంటారు. మానేసిన వారికి కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. కనుక ఇ- సిగరెట్లు కాలిస్తే, అవి ఈ సమస్యలనుండి బయట పడేసి మీరు తేలికగా సిగరెట్ మానేసేలా చేస్తాయి. మీరు స్మాకర్ నుండి నాన్ - స్మాకర్ దశకు తేలికగా చేరిపోవచ్చు.

అసలు ఈ ఇ- సిగరెట్ అంటే ఏమిటి?
ఇ- సిగరెట్లు అనేవి సిగరెట్ వలెనే ఉంటాయి. కాని ఎలక్ట్రానిక్ సహాయంగా తయారు చేయబడ్డాయి. అవి ఖచ్చితంగా సిగరెట్ లానే ఉంటాయి. కాని వాటిలో పొగాకు బదులుగా ఒక హీటర్ మరియు నీటితో నింపిన ఒక చిన్న పైప్ ఉంటుంది.
సిగరెట్ వేడి ఎక్కే కొలది అందులోని నీరు ఆవిరిగా మారుతుంది. దానిలోని కొద్దిపాటి నికోటిన్ ఆవిరిలో కలసి బయటకు వస్తూంటుంది. దానితో సిగరెట్ తాగేవారికి ఆ వాసన వచ్చి తాగాలనే ధ్యాస కలిగించుకుంటారు. శరీరానికి పెద్దగా హాని ఉండదు.
ఇ- సిగరెట్ ప్రయోజనాలు-
అది చవక - సిగరెట్ కాల్చే వారి సిగరెట్ బడ్జెట్ వింటే షాక్ అవ్వాల్సిందే. నిరంతరం వారికి ఖర్చుగానే ఉంటుంది. మరి ఇ సిగరెట్లు వీటితో పోలిస్తే. చాలా తక్కువ.
ఇ సిగరెట్ తిరిగి ఉపయోగించవచ్చు: ఒకే ఇ సిగరెట్ ను మరల వాడవచ్చు. కాల్చగానే అయిపోవటం ఉండదు. ఎలక్ట్రానిక్ సిగరెట్ లో ఒక ఎర్రని లైట్ వెలుగుతూంటుంది. మీరు పీల్చే పొగ మంచి వాసనగల నీటి ఆవిరి. ఇక మీకు ఖర్చు ఎపుడూ ఆవిరిగా మారే దానిలోని నీటిని నింపుతూండటమే.
తాగేటందుకు మధ్యలో బ్రేక్ అవసరంలేదు: ఇ-సిగరెట్ తాగాలంటే బయటకు వెళ్ళి తాగాల్సిన పనిలేదు. అన్ని దేశాల ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడా ఇ సిగరెట్ హాని లేనిదని, ఇంటిలో కూడా తాగేయవచ్చని ఆమోదించాయి. కనుక మీరు మీటింగ్ లో కూర్చొని కూడా ఇ-సిగరెట్ కాల్చేయవచ్చు. పక్కవారికి పొగ పడదన్న బాధ అసలు లేదు.
కాలుష్య నివారణ: సిగరెట్ తాగిన ప్రతిసారి పొగ వెలువడి కాలుష్యం కలిగిస్తుంది. కాని ఇ సిగరెట్ తో ఈ సమస్యేలేదు. మీకు మీ తోటివారికి కూడా కేన్సర్ వంటి సమస్యలు రావు.మీ అలవాటు వలన ఇతరులకు ఇబ్బంది అసలే ఉండదు. పైగా అది ఎప్పటికపుడు రీ ఛార్జి చేసుకోవచ్చు. మరల తాగుతూండవచ్చు.
అదనపు వ్యయం, సిగరెట్లు అయిపోతాయన్న బాధ అసలే వుండవు. ఇ సిగరెట్లను కాల్చటం మొదలుపెడితే, స్మోకింగ్ అతి తేలికగా మానేయవచ్చు. కనుక వెంటనే మీరు ఇ - సిగరెట్ కాల్చటం మొదలు పెట్టండి. మీ ఆరోగ్యానికి మరి ఇతరుల ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు చేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications