Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పొట్టలో గ్యాస్ ఏర్పడితే ఏం చేయాలి ?

గ్యాస్ ఏర్పడటానికి కారణాలను మరింత వివరంగా పరిశీలిస్తే, వ్యాయామం లేకపోవడం, తిన్న వెంటనే అతిగా నిద్రపోవడం, కొన్ని మందుల వలన జీర్ణాశయంలో, కొన్ని సూక్ష్మ జీవుల వలన అని చెప్పవచ్చు. గ్యాస్ ఏర్పడితే, పైనుండి నోటి ద్వారా త్రేన్పులవలన లేదా కిందనుండి అపాన వాయువగా గాని బయటికి పోవాలి. లేకుంటే ఎంతో అసౌకర్యంగా వుంటుంది. జీర్ణవ్యవస్థ, పేగుల ఇన్ ఫెక్షన్ లోపంవంటివాటి వల్ల, కార్బోహైడ్రేట్లు అంటే దుంపకూరలు, పప్పులు వంటివి ఎక్కువగా వాడడం వల్ల పేగులలో వుండే ఒకరకమైన బ్యాక్టీరియా వల్ల కూడా గ్యాస్ ఏర్పడుతుంది.
కడుపు ఉబ్బరిస్తుంది. ఆయాసంకలుగుతుంది, గుండెలో మంట, తేన్పులు వస్తాయి.
కడుపు ఉబ్బరాన్ని నివారించడానికిగాను వ్యాయామం అతిముఖ్యమైంది. అందుకుగాను ప్రతి రోజు అరగంట నుండి ఒక గంట వరకు ఉదయం, లేక సాయంత్రంవేగంగా నడవాలి. లేదా అరబిక్, స్విమ్మింగ్, సైకిలింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. నీళ్లు బాగా తాగాలి. రాత్రిపూట ఆహారం తిన్న వెంటనే నిద్రించరాదు. ఆహారానికి నిద్రకు ఉపక్రమించటానికి కనీసం రెండు లేదా మూడు గంటల వ్యవధి వుండాలి. గ్యాస్ ఎక్కువ చేసే ఆహారాలు తగ్గించాలి. మసాలాలు, బేకరీ ఆహారాలు తగ్గించాలి. ఒకే సమయానికి మితంగా ఆహారం తినాలి. ఈ చిట్కాలతో గ్యాస్ ఏర్పడటం తగ్గకపోతే, వైద్యులను సంప్రదించి తగిన మందులు వాడాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications