Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
కుంటి సాకులు! ... చివరకు కంటి నీళ్ళు!!

మీ సోమరి తనాన్ని సమర్ధించుకుంటూ మీరు చెప్పే కారణాలు కూడా ఎలా వుంటాయో చూడండి.
1. వంశానుగతంగా వచ్చింది. వేరెవరిని నిందించకుండా....ఆనందంగా మన జన్యువులను మనమే నిందించుకుంటాం. నా జీన్స్ కారణంగా అందంగా లేను, నా జీన్స్ కారణంగా లావుగా వున్నాను వంటి కారణాలన్ని మీకు మీరు చూపుకునే కుంటి సాకులు మాత్రమే. మీ జీన్స్ అంటూ వాటిని నిందించకండి. జీన్స్ ఎంత ప్రభావం చూపినప్పటికి, క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేసే వ్యాయామాలు తప్పక మీ లావు తగ్గిస్తాయి.
2. డైటింగ్ - నేను డైటింగ్ చేయలేను. ఏం తినకుండా అసలుండలేను. డైటింగ్ చేయకుండానే బరువు తగ్గించుకోవచ్చు. తినటం మానేస్తే ఎన్నో సమస్యలు వస్తాయనేది అందరికి తెలిసినదే. మీకు తెలియాల్సిందల్లా....ఆరోగ్యకరమైన ఆహారాలు మితిమీరకుండా ఆరోగ్యంగా తినాలనేదే. పచ్చని కూరలు, ఆకు కూరలు తినండి. కొంత బలహీన పరచినా, ఫలితం చూపుతాయి.
3. వ్యాయామాలకు సమయం లేదు - వ్యాయామాలకు సమయం లేకుంటే.....ఇక చనిపోవటానికి సమయం వుందా? మరి ఇకపై జరిగేది అదే. చాలామంది అధికబరువులతో మరణించినవారున్నారు. అధికబరువు మిమ్మల్ని మందంగా వుంచి గుండె జబ్బులు కలిగిస్తుంది. రక్తనాళాలనిండా కొల్లెస్టరాల్ పేరుకుంటుంది. 40 ఏళ్ళు వచ్చేసరికి గుండె పని చేయటం ఆగిపోవచ్చు కూడాను. తినటానికి, నిద్రించటానికి, స్నానానికి వీటికి సమయం వున్నపుడు వ్యాయామాలకు ఎందుకు వుండదనేది సూటి ప్రశ్న.
4. అవన్నీ నేను ఎపుడో ప్రయత్నించా...ఏదీ పనిచేయదు - వ్యాయామాలు తప్పించుకునేటందుకు ఇదొక కుంటి సాకు. మీరు ప్రయత్నించినపుడు...సరైన రీతిలో ప్రయత్నించారా? డైటింగ్, వ్యాయామం వంటివి జీవన విధానాల మర్పుకు తోడ్పడాలి. ఇవన్నీ మీకు పనిచేయలేదంటే....ఇక మీకు ధైరాయిడ్ సమస్య వుండి వుండాలి.
కుంటి సాకులు చెప్పి వ్యాయామం, ఆహారం వంటివి తప్పించుకోవచ్చు. కానీ వాటి ఫలితాలనుండి తప్పించుకోలేరనేది గ్రహించండి. కనుక, కుంటిసాకులు చెప్పకుండా సోమరితనాన్ని వదలి ప్రతిరోజూ వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తూ శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications