Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కీళ్ళ నొప్పులకు వ్యాయామాలు చేయటం ఎలా?

ఈ వ్యాధిని తగ్గించుకోవాలంటే మంచి మందు వ్యాయామం. వ్యాయామం చేస్తూ వుంటే గట్టితనం పోయి మెతకదనం వస్తుంది. కడరాలు బలాన్ని పుంచుకొని బరువు భరించే శక్తి పొందుతాయి. బరువు కూడా తగ్గుతారు కనుక ఆరోగ్యంగా వుంటారు. కీళ్ళ జబ్బులను సహజంగా త్వరగా తగ్గించుకోవాలంటే బరువు తగ్గటం ఒకటే మార్గం. శరీర బరువు అధికమయ్యే కొలది దాని బరువు అంతా కీళ్ళపై పడి అవి మరింత అరుగుదలను కూడా చూపిస్తాయి. ఒక దశ దాటిన తర్వాత వీటిని నివారించటం కూడా కష్టమవుతుంది.
వీటికి ట్రీట్ మెంట్ లో భాగంగా తగిన విశ్రాంతి, రిలాక్సేషన్, సరైన ఆహారం తీసుకోవడం, ధ్యానం చేయటం వంటివి కూడా చెప్పవచ్చు. వివిధ కదలికలతో కూడిన వ్యాయామాలు ప్రతిరోజూ లేదా రోజు విడిచి రోజు తప్పనిసరిగా చేయాలి. బలం కోసం చేసే వ్యాయామాలు కండరాల బలాన్ని పెంచుతాయి. బలమైన కండరాలు దెబ్బతిన్న జాయింట్లకు సహకరించి సరిగా పనిచేసేలా చేస్తాయి. నడక, స్విమ్మింగ్, అరబిక్ వ్యాయామాలు వంటివి వీటికి సత్వర పరిష్కారం ఇస్తాయి.
జాయింట్లలో వాపు లేదా నొప్పి చూపితే తప్ప వ్యాయామాలు మానాల్సిన అవసరం లేదు. అరబిక్ వ్యాయామాలు కీళ్ళనొప్పులకు సహకరించటమే కాక, అధిక బరువు తగ్గించటం, శరీరం ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. నొప్పి లేకుంటే ప్రతిరోజూ రెండు సార్లు 20 నిమిషాల చొప్పున ఈ వ్యాయామాలు చేయాలి. వ్యాయామాలు మొదలుపెట్టే ముందు, మీ శారీరక ఫిట్ నెస్ కొరకై డాక్టర్ ను సంప్రదించండి. చాలామంది తక్కువ శ్రమకల వ్యాయామాలను కీళ్ళనొప్పులకై చేసి అధిక లాభం పొందుతూంటారు. కీళ్ళ నొప్పులకు వ్యాయామాలు మొదలు పెట్టాలనుకునేవారు ఒక శారీరక వైద్యుని సంప్రదించి అందుకు తగిన వ్యాయామాలు, నొప్పి తగ్గించే పద్ధతులు, కీళ్ళ రక్షణ, శరీర శక్తి సంరక్షణ వంటి అంశాలను తెలుసుకొని మొదలు పెట్టటం సరైనదిగా భావించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications