Latest Updates
-
దుర్గాష్టమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? అమ్మవారి అనుగ్రహం పొందడానికి పాటించాల్సిన నియమాలు, శుభ ముహూర్తాలివే! -
మే 23 శనివారం: శుక్ల సప్తమి వేళ శని దేవుడి మార్పు.. ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి భారీ అదృష్టం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 23 మే 2026 -
పల్లెటూరి రుచులతో నోరూరించే దహీ వడ.. ఒక్కసారి ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ అడుగుతారు! -
విజయవాడలో థార్ వాహనాలతో వీరంగం.. ప్రేమ పేరుతో జరుగుతున్న ఈ ప్రమాదకరమైన టాక్సిక్ రిలేషన్స్ వెనుక అసలు నిజాలేంటి? -
హాట్ హాట్ సమ్మర్లో పచ్చి మామిడితో జ్యూస్, ఘాటుఘాటుగా పచ్చడి.. -
ఎండల వేళ పెళ్లిళ్లు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ చిన్న మార్పులు చేయకపోతే కష్టమే! -
మండుతున్న ఎండలకు పర్ఫెక్ట్ కిక్.. ఇంట్లోనే చల్లచల్లని స్పైసీ లెమన్ సోడా చేసుకోండిలా! -
బేకరీ స్టైల్ చాక్లెట్ కేక్ ఇంట్లోనే.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ -
శుక్రుడి కటాక్షం.. ఈరోజు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం, కెరీర్లో తిరుగులేని సక్సెస్!
కడుపు నింపే తిండ్లు?
Wellness
oi-Nageswara
By B N Sharma

ఓట్ మీల్ - దీనిలో కార్బోహైడ్రేట్లు అధికం. జీర్ణం అవటానికి సమయం తీసుకుంటుంది. కనుక ఎనర్జీ చాలా నెమ్మదిగా వస్తుంది. అధిక సమయం కడుపు నింపి వుంచుతుంది. బ్రేక్ ఫాస్ట్ గా ఈ ఆహారం బాగుంటుంది.
బాదం మరియు ఆక్రోట్లు - వీటిలో కావలసినంత పీచు, ప్రొటీన్లు, కొవ్వు మినరల్స్, సూక్ష్మపోషకాలు వుంటాయి. కొవ్వు పెరగకుండా మీకు కావలసినంత ఎనర్జీనిస్తాయి.
కొవ్వు తక్కువగా వుండే పాల ఉత్పత్తులు - కొవ్వు తీసిన ఛీజ్, పెరుగు వంటివి కొవ్వు కరిగించే కాల్షియం అందిస్తాయి. తగిన కాల్షియం తీసుకోపోతే కొవ్వు అధికంగా నిల్వ వుంటుందని కూడా స్టడీస్ చెపుతున్నాయి.
బీన్స్ - ఫైబర్, ప్రొటీన్లు అధికం. జీర్ణం కావటానికి అధిక సమయం పట్టడంతో కడుపు నిండుగా వుంటుంది. ప్రొటీన్లు మానసికంగా తృప్తి కలిగిస్తాయి. మరల మరల తినాలన్న ధ్యాస వుండదు.
జోవార్, బజ్రా, రాగి వంటి ధాన్యాలు కార్బో హైడ్రేట్లు కలిగి వుండి జీర్ణక్రియలో మెల్లగా గ్లూకోజ్ రిలీజ్, వీటిలో కావలసినంత ఫైబర్, విటమిన్ బి కాంప్లెక్స్ కూడా వుండి మెటబాలిజం పెంచుతాయి.
ఆపిల్స్ - వీటిలో నీరు అధికం, ఫైబర్ అధికంగా వుండటం వలన కడుపునిండినట్లు భావించేస్తాము. యాపిల్ తొక్కలో పెక్టిన్ ఫైబర్ ఆకలిని చంపే ఔషధంలా పనిచేస్తుంది. బరువు ఎక్కకుండా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Comments
English summary
Foods make you feel full! | కడుపు నింపే తిండ్లు?
Story first published: Tuesday, January 17, 2012, 12:20 [IST]
Other articles published on Jan 17, 2012



Click it and Unblock the Notifications