Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మనం తినే పండ్లలో హాని ఎంత?

పండ్లను వ్యాపారస్తులు తమ వ్యాపార సౌకర్యం కొరకుగాను ముందుగానే యూరియా, ఈధేన్, కాల్షియం కార్బైడ్ వంటి కెమికల్స్ వేసి పచ్చివాటిని ముందస్తుగానే పండ్లుగా తయారు చేయటం వంటి చర్య కూడా ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పచ్చివాటిని పండుగా తయారు చేయటానికి గ్యాస్ వదిలే పద్దతులననుసరించి వ్యాపారస్తులు వాటి నాణ్యతలను, నిలువను వారు కోరినట్లే చేస్తున్నారు.
ఈ రకంగాపండ్లను, ఎధిలిన్ గ్యాస్ తో కృత్రిమంగా పండు చేయటం వలన నరాల వ్యవస్ధపై అది ప్రభావించి కళ్ళు, చర్మం, ఊపిరితిత్తులు, చివరకు జ్ఞాపక శక్తి సైతం దెబ్బతినగలదు. కొన్ని దేశాల ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవచూపి ఈ రకమైన గ్యాస్ వినియోగ చర్యలను నిషేధించినప్పటికి, వ్యాపారస్తులు ప్రత్యామ్నాయ మార్గాలలో తమ వ్యాపారానికి అనుకూలంగా పచ్చివాటిని కొనుగోలు చేసి వారి గిడ్డంగుల నిలువకు వ్యాపారానికి అనుకూలంగా ఇతర పద్ధతులలో వాటిని పండుగా తయారు చేస్తూనే వున్నారు. వీరి చర్యలకు తోడు రైతులు ఎన్నో పురుగుమందులు, రసాయనిక ఎరువులు వాడి పంట దిగుబడులు సాధిస్తున్నారు. కనుక ఈ పరిస్ధితులలో వినియోగదారులుగా కనీసం మనం చేయగలిగినది ఏమిటనేది పరిశీలిద్దాం.
1) మీరు తినే పండ్లు, కూరగాయలు కొద్దిపాటి ఉప్పు, నిమ్మరసం కలిపిన నీటితో పూర్తిగా కడగండి. పండ్లను కనీసం నీటిలో 5 నుండి 7 నిమిషాలు వుంచేలా చూడండి. తర్వాత వాటిని మంచినీటితో శుభ్రంగా కడిగి పొడిగా ఆరనిచ్చి వాటిని తినండి.
2) పండ్లను కొనే ముందు, వాటి నాణ్యతను బాగా పరిశీలించండి. వాటికి ఏ రకమైన పౌడర్ వినియోగం లేదా ఇతర గుర్తులు వుంటే వాటిని కొనుగోలు చేయకండి.
fruits, chemicals, పండ్లు, రసాయనాలు
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications