Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
రాత్రి సమయం కాలు పట్టేస్తే...!

కాలి పిక్క కండరాల నొప్పి తగ్గించటమెలా?
కాలిని బాగా విదిలించండి. వేగంగా విదిలించండి. పిక్కను మీ చేతులతో బాగా కదపండి. తక్షణమే కదిపితే నొప్పి తగ్గుతుంది. కొద్దిపాటి నూనెతో మెల్లగా మసాజ్ చేయండి. మునివేళ్ళతో మసాజ్ చేయండి. నిమిషాల్లో నొప్పి మాయం అవుతుంది. కాలికండరాలు సడలాలంటే కొద్దిగా వ్యాయామం చేయండి.
మీ నిద్రా భంగిమ సరి చూసుకోండి. ఈ రకమైన పిక్క కండరాల నొప్పులు తగ్గాలంటే పడుకునే భంగిమ సరిగా వుండాలి. బోర్లా పడుకునే వారైతే, కాళ్ళకింద ఒక తలగడ వుంచండి. నిద్రించేటపుడు గట్టిగా బ్లాంకెట్ కప్పుకోకండి. ఈ చర్య మీ కాళ్ళకు నొప్పి వచ్చేలా చేస్తుంది.
మీ కాళ్ళను చాపటం మానండి. బెడ్ కు వెళ్ళేముందుగా మీ కాళ్ళను మోకాలు వరకు బెడ్ నుండి కిందకు వేలాడేలా చూడండి. అపుడు నిద్రలో అవి పట్టుకోవు. కాలికండరాలు రిలాక్స్ అవ్వాలంటే కొన్ని అరబిక్ వ్యాయామాలు చేయండి. అపుడు ఈ సమస్య అసలుండదు.
మీ ద్రవాహారాలు ఏం తాగుతున్నారో పరిశీలించండి. కాఫీ లేదా ఆల్కహాల్ వంటివి అధికంగా తాగితే అవి శరీరంలో డీహైడ్రేషన్ కలిగించి ఇటువంటి సమస్య తెచ్చేందుకు అవకాశం వుంది. కనుక తగినంత నీరు తాగుతూ పాల ఉత్పత్తులు మీ ఆహారంలో పెంచండి. అరటిపండు మీ కాలి నొప్పిని సహజంగా తగ్గిస్తుంది. వాటిలో పొటాషియం వుండి మీ శరీర కండరాలను పటిష్టం చేస్తుంది.
రాత్రులందు మీకు కాలి పిక్క కండరం పట్టేస్తే, తక్షణం దానిని బాగా విదిలించటం ద్వారా తగ్గించవచ్చు. అటువంటివి మరల రాకుండా, సరైన ఆహారం నిద్ర శరీరానికి ఇవ్వండి. గతంలో మీకు ఇటువంటి అర్ధరాత్రి కాలు పట్టే సమస్య వచ్చి వున్నట్లయితే దానిని వెంటనే ఎలా తగ్గించుకున్నారనేది మాకు తెలియపరచండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications