Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గాఢ నిద్ర పొందటమెలా?

సరిగా నిద్రించని చిన్నవయసు డ్రైవర్లు తమ వాహనాలను సరిగా నడపలేక యాక్సిడెంట్లకు గురవుతున్నట్లు తమ ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నట్లు నేషనల్ సెంటర్ ఆన్ స్లీప్ డిజార్డర్స్ డైరెక్టర్ డా. కార్ల్ ఇ. హంట్ ఒక సర్వేలో తెలిపారు. స్కూలు విద్య లేదా ఉద్యోగాలు, ఇతర క్రీడా కార్యక్రమాలు, సామాజిక చర్యలు వీటన్నిటితో సాయంత్రమయ్యే సరికి అలసట పొందుతారని, సాయంత్రం నుండి అర్ధ రాత్రి వరకు టి.వి.లు, కంప్యూటర్లకు అంటిపెట్టుకుని సరైన వ్యాయామం వంటివి కూడా లేకుండా బలహీనపడిపోతున్నారని
శరీరం, మనసు రెండూ కూడా నిద్రించాలని తెలిపారు. సరిగా నిద్రించనివారికి జ్ఞాపక శక్తి నశిస్తోందని, వీరిలో ప్రవర్తనా సమస్యలు, తరచుగా కోపోద్రేకాలు వంటివి కలుగుతున్నాయని, కనుక ఒక రాత్రి గాఢ నిద్ర వీటన్నిటికి సమాధానంగా వుండగలదని తెలిపారు. గాఢ నిద్ర పట్టించుకోవాలంటే, ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రించటం, నిద్రించే సమయంలో ఏ ఆందోళనలూ లేకుండా విశ్రమించడం, పడక సమయంలో అధింగా భుజించకుండా వుండటం, నిద్రించేముందు కేఫైన్ కల కాఫీ తాగకపోవడం వంటివి మంచి చిట్కాలుగా తెలుపుతున్నారు. పిల్లలైనా, పెద్దలైనా ప్రతిరోజూ రాత్రులందు కనీసం 8 నుండి 9 గంటలు నిద్రిస్తే, అది ఆరోగ్యం, సంక్షేమం, వారు చేసే పనులలో సమర్ధతలనిస్తుందని తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications