Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పానీయానికి ప్రత్యామ్నాయమే లేదు?

1. కొబ్బరినీటిలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటివి వుండి శరీరానికి ఎలెక్టోలైట్స్ కలిగిన ఎనర్జీ డ్రింక్ గా పనిచేస్తుంది.
2. కొబ్బరి నీరు అనేక పోషక విలువలు కలిగి, కేలరీలు, కొవ్వు అతి తక్కువగా వుండి శరీరం అధిక బరువు పొందకుండా చక్కటి ఎనర్జీని ఇస్తుంది.
3. అజీర్ణంగా వుంటే ఒక్క గ్లాసెడు లేత కొబ్బరి బొండాం నీరు కడుపులోని మంట, గ్యాస్, త్రేన్పులు మొదలైనవి తగ్గించి ఎంతో హాయినిస్తుంది.
4. కొబ్బరినీరు మీకు హాయి కలిగించటమే కాదు శరీరానికి చల్లటి అనుభూతిని కలిగించి మీ జీర్ణవ్యవస్ధను మెరుగుపరుస్తుంది. గ్యాస్ సంబంధిత సమస్యలున్నవారికి కొబ్బరి నీరు తాగటం మంచి పరిష్కారం.
5. వేసవికాలంలో శరీరానికి డీ హైడ్రేషన్ కలిగితే కొబ్బరి నీరు తాగితే సమస్య పరిష్కారమవుతుంది.
6. కొబ్బరి నీటిలో షుగర్ చాలా తక్కువ కనుక డయాబెటిక్ రోగులకు గుండె జబ్బులవారికి ఇది మంచి ఆహారం. అధిక బరువు తగ్గాలంటే పోషకాహార నిపుణులు కొబ్బరినీటిని సిఫార్సు చేస్తారు.
7. జీవ ప్రక్రియను మెరుగుపరచి అలసటను దూరం చేస్తుంది. శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది.
8. మూత్ర సంబంధిత వ్యాధుల నివారణ, కిడ్నీ మరియు మూత్ర పిండాలలోని రాళ్ళను కరిగించటంలో కూడా కొబ్బరినీరు అధిక ప్రాధాన్యత కలిగివుంది.
9. జుట్టు ఊడుతోందా? ప్రతిరోజు ఒక కొబ్బరి బొండాం నీరు తాగండి. అది జుట్టు ఊడకుండా కాపాడటమే కాదు వెంట్రుకల ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ అధికం చేస్తుంది.
10 శరీరాన్ని చల్లగా వుంచి చర్మంపై వచ్చే మొటిమలు, ఇతర వ్యాధులను తగ్గించి చర్మం సహజంగా మెరిసిపోయేలా చేస్తుంది.
ఇన్ని ప్రయోజనాలున్న కొబ్బరి బొండాం నీరు తాగి వాటిని ఆనందించటం నేడే మొదలుపెట్టండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications