Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆరోగ్యాన్ని సంరక్షించే నీటి ప్రత్యామ్నాయాలు!

1. కొబ్బరి బోండాం - శరీరానికి తగిన నీరు, పోషకాలను ఇచ్చి కాపాడుతుంది. ప్రకృతి అందించిన సహజ పానీయం. రోజులో ఎపుడైనా తాగవచ్చు. దీనిలో పొటాషియం, కాల్షియం, సోడియం, ఫాస్పరస్, సల్ఫర్, క్లోరైడ్స్ వంటివి ఎన్నో వుంటాయి. కొబ్బరి బొండాం నీరు తాగితే గుండెమంట, మలబద్ధకం, మొదలైన వాటిని వెంటనే పోగొడుతుంది.
2. మజ్జిగ - గ్యాస్ సంబంధిత సమస్యలున్నవారికి మజ్జిగ మంచి పానీయం. పొట్టను శుభ్ర పరచి చల్లని భావన కలిగిస్తుంది. వెన్న తీసేస్తే కొవ్వు తక్కువ. కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్లు మొదలైనవి వుంటాయి. పెరుగును చిలికితే వచ్చేది మజ్జిగ.
3. నిమ్మ రసం - ఒక్క గ్లాసెడు నిమ్మరసం తక్షణ శక్తి నిస్తుంది. మంచి రుచి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి శరీరాన్ని ఎప్పటికపుడు తాజాగా వుంచుతుంది.
4. సూప్ లు - వేడి సూప్ రోజులో ఎపుడు తీసుకున్నా చక్కని ఆరోగ్యాన్నిస్తుంది. దీనిలో విటమిన్లు, మినరల్స్, అనేక శక్తి నిచ్చే లవణాలు వుంటాయి. కడుపు నింపుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసే సుగంధ వస్తువులు దీనిలో వుంటాయి. మంచి రుచి కూడా వుంటుంది.
నీరు నిస్సందేహంగా శరీరానికి అత్యవసరమే, ఇతరంగా ఏ పానీయం తాగినప్పటికి అది నీటికి సమానం కాదు. అయినప్పటికి, పరిశుభ్రమైన నీరు లభించనపుడు శరీరావసరాలకు గాను పైన తెలిపిన ప్రత్యామ్నాయ పానీయాలు అవసరం తీర్చటమే కాక ప్రత్యామ్నాయంగా పని చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications