Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
పబ్ లలో ఆరోగ్యకర ఆహారం తినటం ఎలా?

పబ్ లో తాగేముందు మీరు ఆల్కహాల్ తో మీ ఆహారాలు కలపకండి. ఉదాహరణకు ఉప్పు, నూనె లేదా వేపుడు పదార్ధాలు, పాల ఉత్పత్తులు, ఆల్కహాల్ తో కలుపరాదు.ఈ ఆహారాలు అలా కలిపితే, పొట్టలో మంటపెట్టటం, అజీర్ణం చేయటం జరుగుతుంది. చాలా సార్లు మీరు వాంతి కూడా చేసుకుంటారు. కనుక, మీరు పబ్ లో తాగేటపుడు ఆరోగ్యకర ఆహారాలు ఏమి తినాలనేది పరిశీలించండి.
ఆల్కహాల్ తో తినదగిన ఆరోగ్యకర ఆహారాలు
రొయ్యలు - రొయ్యలతో చేసిన స్నాక్స్ ఆల్కహాల్ తో మంచి కాంబినేషన్. అవి మెత్తగా ఉండి, తేలికగా వెంటనే నోటిలో కరిగిపోతాయి. బాగా వేయించిన రొయ్యలు కర కరమంటూ వుంటాయి. కాని ఇవి ఆరోగ్యానికి అధిక లాభం చేర్చవు. ఆల్కహాల్ తాగుతూ బరువు పెరగరాదంటే, మరీ వేపుడు చేయని రొయ్యలు తినండి. మీ శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గుతాయి. ఆల్కహాల్ తో రొయ్యలు తింటే మీ శరీర షుగర్ స్ధాయిలు కూడా పెరగకుండా వుంటాయి. సాధారణ ఆల్కహాలు షుగర్ లెవెల్ పెంచుతుంది.
ఆలివ్ పండు - వైట్ లేదా రెడ్ వైన్ తాగేవారైతే, దానిని ఆలివ్ పండుతో తినండి. ఎన్ని కావాలన్నా తేలికగా తినేయవచ్చు. అవి ఆరోగ్యం, తేలికగా జీర్ణం అవుతాయి. ఆలివ్ మీ శరీరంలోని రక్తప్రసరణ పెంచి ఉత్సాహం ఇస్తుంది. కనుక వైన్ తో ఆలివ్ తినవచ్చు. మంచి రుచి ఆరోగ్యకరమైన పండు, ఆల్కహాల్ తో కలుపదగినది. మీరు తాగే వైన్ గ్లాస్ లో ఒక ఆలివ్ వేయమని బేరర్ ని తప్పక అడగండి.
పిస్తా పప్పులు - పిస్తా ఆరోగ్యకరమైనదని అనేక పరిశోధనలు తెలిపాయి. వీటిని మీరు పచ్చివిగా తినవచ్చు లేదా ఆల్కహాల్ తో మిక్స్ చేసి తినవచ్చు. మీరు పబ్ కు వెళ్ళేటపుడు పిస్తా పప్పులు తీసుకెళ్ళి తినేయండి. ఈ పప్పులు రక్తంలో చెడు కొల్లెస్టరాల్ తగ్గించటమే కాక, బరువు నియంత్రణ కూడా చేస్తాయి. కొద్దిగా ఉప్పు కలిపిన పిస్తాలు మీ మందు అధిక ప్రభావం మీపై పడకుండా కూడా చేస్తాయి.
సలాడ్ - తాజా కూరగాయలు, పండ్లతో చేసిన గ్రీన్ సలాడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నూనెలలో దేవిన స్నాక్స్ కంటే కూడా చక్కని గ్రీన్ సలాడ్ ఆల్కహాల్ కు జతచేయండి.
మీరు పబ్ కు వెళ్ళినపుడు...వీటిని ఆర్డర్ చేయటం మానండి...
క్రీమ్ అధికంగా ఉండే స్నాక్స్ - ఇవి మీ శరీరానికి అధిక కేలరీలు ఇస్తాయి. ఆరోగ్యకరం కాదు.
పికెల్ కలిపిన గుడ్డు - సాధారణంగా సైడ్ డిష్ గా ఆల్కహాల్ తో పచ్చళ్ళు లేదా కారం కలిపిన గుడ్డు వాడతారు. పచ్చడి తింటూ వుంటే, మందు ప్రభావం అధికంగా ఉండదని భావిస్తారు. కాని, అవి మీకు ఎసిడిటీ కలిగించి వాంతి తెప్పిస్తాయి. గుడ్డు కడుపు నింపుతుంది, అయితే ఇది డైరీ ప్రాడక్టు కనుక మీరు తాగింది వాంతి అయ్యేలా చేస్తుంది. కనుక పికెల్ వేసిన గుడ్డును ఆల్కహాల్ తో తినకండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications