Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అన్ని మంచి అలవాట్లయితే?

మైగ్రేన్ తలనొప్పి పోగొట్టుకోవాలంటే ఆరోగ్యపు అలవాట్లు ఎలా వుండాలి?
సమయానికి తినండి - ఏ కారణంచేతైనా సరే మీరు భోజనం మానేస్తే అది మీ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పాడుచేస్తుంది. మైగ్రేన్ తో బాధపడుతూ డైటింగ్ చేసేవారైతే, భోజనం మానేయటం మీ అధికబరువుతగ్గిస్తుందని భావించకండి. అది మీలో బ్లడ్ షుగర్ స్ధాయిలను పెంచుతుంది. ఇది చివరకు మైగ్రేన్ కలిగిస్తుంది. భోజనం మానేస్తే ఎసిడిటీ కలిగి మీ బ్రెయిన్ సరిగా పనిచేయక తలనొప్పి కలుగుతుంది. ఈ రకమైన సమస్యలకు పరిష్కారం సరైన సమయానికి క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం. అతి తక్కువగా తినటం లేదా భోజనం మానేయటం చేయకండి.
వ్యాయామం - ఆరోగ్యకర శరీరంలో ఆరోగ్యమైన మైండ్ వుంటుంది. బలంగా, చురుకుగా వుండేందుకు క్రమం తప్పని వ్యాయామం చేయండి. ఇది మైగ్రేన్ రాకుండా కూడా సహకరిస్తుంది. ఒత్తిడి కలిగితే, చిన్నపాటి నడక, స్విమ్మింగ్ లేదా యోగా వంటివి చేయండి. ఇవి మైగ్రేన్ తగ్గించటమే కాక మీరు తాజాగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడతాయి.
తగినంత నిద్ర- నిద్ర అధికం లేదా తక్కువ వుండరాదు. రెండూ కూడా అనారోగ్యమే. తగినంత నిద్ర మైగ్రేన్ దూరం చేస్తుంది. పెద్దలు రాత్రులందు 6 నుండి 7 గంటల నిద్ర పోవాలి. రోజుకు 9 గంటలు మించరాదు.
చెడు అలవాట్లు - చెడ్ అలవాట్లు వదలండి. పొగతాగటం, ఆల్కహాల్ మైగ్రేన్ నొప్పిని పెంచుతాయి. సిగరెట్ లో వుండే నికోటైన్ గొంతు, ఊపిరితిత్తులకు మంట కలిగించటమే కాక మత్తు కలిగిస్తుంది. ఆల్కహాల్ లో మైగ్రేన్ కలిగించే టిరమైన్ అనే పదార్ధం వుంది. ఇది అధికమైతే తలనొప్పి, హేంగోవర్ లు కలిగిస్తుంది.
పనిలో బ్రేక్ - ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరంగా పనిచేయకండి. అది ఒత్తిడి కలిగించి మీరు చేయాలనుకునేది కూడా చేయలేకపోతారు. మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ కొద్ది నిమిషాలు విశ్రాంతి పొందండి. ఉదాహరణకు తోటి ఉద్యోగితో సంభాషణ లేదా రెస్ట్ రూమ్ లో 5 నిమిషాలు గడపటం వంటివి చేయాలి. అదే సమయంలో మీ పని సమర్ధవంతంగా కూడా వుండాలి.
ఈ మంచి అలవాట్లు మీ రోజువారీ కార్యక్రమంలో ఆచరిస్తే, మైగ్రేన్ తలనొప్పి రాకుండా వుండే అవకాశం వుంది. ఉన్నవారికి పోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications