Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
నలభైలలో నవ్వుతూ బతకండి!

వ్యాయామం
ప్రతివారం 3 నుండి 6 గంటలు వ్యాయామం చేయండి. జాగింగ్, లేదా క్రీడలు లేదా జిమ్ వంటివి ఆచరించండి. వ్యాయామం చేస్తే, కండరాలు పటిష్టమై ఏ వ్యాధులూ రాకుండా వుంటాయి. ప్రధానంగా, అది మీ ఒత్తిడి స్ధాయి తగ్గిస్తుంది. ఈ ఒత్తిడే మీ నలభైలలోని ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
ఒత్తిడి తగ్గితే, గుండెకు విశ్రాంతి. అధిక కాలం జీవిస్తుంది.
పోషకాలు
నేటి రోజుల ఆహారాలు నాణ్యత తక్కువ. కనుక మల్టీ విటమిన్లు, మినరల్ టాబ్లెట్ లు వాడండి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు బాగా కలిగి వుండండి. విటమిన్లు, మినరల్స్ అనేవి శరీర వివిధ భాగాల నిర్వహణకు అవసరం. ఉదాహరణకు బి బిటమిన్లు అయిన ఫోలిక్ యాసిడ్, బి 6, బి 12 వంటివి శరీరంలో హోమోసిస్టీన్ స్ధాయి నిర్వహిస్తాయి. దానితో డిమెన్షియా వ్యాధి రాకుండా వుంటుంది.
చదవండి
సోషల్ నెట్ వర్కింగ్ అధికమైన ఈ రోజులలో చాలామంది యువత వారి మెదడుకు వ్యాయామం పెట్టటం లేదు. కనుక మీ మెదడుకు పదును పెట్టే చర్యలు, చదవడం, చెస్ ఆడటం, ప్రతిరోజూ క్రాస్ వర్డ్ పజిల్సు చేయడం వంటివి చేయండి. ఏదైనా ఒక మ్యూజిక్ సాధనం ప్రాక్టీస్ చేయండి. ఈ చర్యలు మీ మెదడు ముసలిదవకుండా లేదా, బ్రెయిన్ సంబంధిత డిమెన్షియా వంటి వ్యాధులు భవిష్యత్తులో రాకుండా కాపాడతాయి.
లైట్లు తీసేయండి
మీరు ఇరవైలలో వుండగా ప్రతిరోజూ కష్టపడి పనిచేయడం, పార్టీల పేరుతో నిద్ర సరిగా పోకపోవడం వంటివి చేస్తే, వీటి ప్రభావం మీ నలభైలలో తప్పక పడుతుంది. నిద్ర అత్యవసరం. నిద్రలో మీ శరీర ఆరోగ్యానికి అవసరమైన శరీర అంగాల రిపేరు, క్లీనింగ్ వంటివి జరుగుతాయి. మీరు నిద్ర పోకపోతే, ఈ పనులు ఎప్పటికపుడు వాయిదాలు పడుతూ చివరకు అనారోగ్యాలు కలిగి శరీరానికి నష్టం కలిగిస్తాయి. నిద్ర ఎప్పటికపుడు మీ శరీరం శక్తిని పుంజుకునేలా చేస్తుంది. కనుక ప్రతిరోజూ మీరు తగినంత నిద్ర పొందేలా చూడండి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రించండి. మీ శరీర గడియారం సక్రమంగా వుండేలా శారీరక విధులు నిర్వర్తించండి.
ఎముకల అరుగుదల
మీకు 20 సంవత్సరాల వయసు వచ్చిందంటే, మీ ఎముకల పెరుగుదల ఆగిపోతుంది. అయినప్పటికి ఎముకల సాంద్రత, బలం వంటివి మీ 30 సంవత్సరాల వయసు వరకు ఏర్పడుతూనే వుంటాయి. చిన్న వయసు స్త్రీలు, పురుషుటు ఈ సమయంలోనే వారి బోన్ బ్యాంక్ రనెడీ చేసుకుంటే, నలభైల పైన వచ్చే ఆస్టియో పోరోసిస్ లేదా ఎముకల అరుగుదల అనే వ్యాధి వారిని ఏమీ చేయలేదు.
ఒక రొటీన్ ఆచరించండి...
18 నుండి22 సంవత్సరాల వయసులో కనుక ఒక రొటీన్ జీవితానికి అలవాటు పడితే, అదే రొటీన్ వారి మధ్య వయసులో కూడా జరిగినట్లు స్టడీలు చెపుతున్నాయి. ఈ వ్యాసం జర్నల్ మెడిసిన్ అండ్ సైన్స్ లో ప్రచురించారు. ఈ దైనందిన చర్యలు భవిస్యత్తులో మీకు రక్తనాళాల బ్లాకేజి, గుండె జబ్బులు రాకుండా చేస్తాయి.
పీచుపదార్ధాలు
పీచు పదార్ధాల వినియోగంపై అమెరికా, యూరోప్ దేశాలలో షుమారు 10 స్టడీలు చేశారు. రోజుకు వినియోగించిన 10 గ్రాముల పీచును తిన్నవారు గుండె జబ్బులను షుమారుగా 14 శాతం తక్కువగా అనుభవించారట. పైగా గుండె జబ్బులతో చనిపోయే అవకాశాలు సుమారుగా 25 శాతం తగ్గిపోయాయని స్టడీ తెలిపింది. కనుక పీచు పదార్ధాల వినియోగం అధికం చేసి ఆరోగ్యంగా వుండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications