Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఆరోగ్యానికి మేలు చేసే పోషకాల లిస్ట్ ఇదిగో...
ఆహారంలో ప్రొటీన్ల మోతాదు తక్కువుగా ఉంటే ఆకలి ఎక్కువుగా అవుతుంది. 15 శాతం ప్రోటీన్లు ఉన్న భోజనం చేసే వారితో పోలిస్తే 10 శాతం ప్రోటీన్లు ఉన్న భోజనం తీసుకునే వారు ఒక రోజులో 260 క్యాలరీలు ఎక్కువగా తీసుకుంటారు. 70 శాతం అదనపు క్యాలరీలు చిరు తిండ్ల ద్వారానే సమకూరుతుంది. ఏడాది తిరిగే సరికి సుమారు ఆరు కిలోల బరువు కూడా పెరుగుతాము. దీన్ని నివారించాలంటే మాంసం,చేపలు, కోడిగుడ్ల వంటి ఆహారాన్ని సాధారణంగా తీసుకునే దాని కన్నా ఎక్కువుగా తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ల నిష్పత్తి తగ్గితే ఆకలి పెరిగి అదనపు శక్తిని తీసుకుంటాము.
ఆహారాన్ని స్వీకరించడంలో సమతుల్యత, వైవిధ్యం మరియు మితంగా వ్యవహరించడం అనేవి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లుగా నిపుణులు నిర్ధారించారు. క్లుప్తంగా చెప్పాలంటే, ఎక్కువ క్యాలరీలు పొందకుండా మరియు ఒకే దానిని అతిగా స్వీకరించకుండా అనేక రకాలు ఆహార పదార్ధాలను తీసుకోవడమన్నమాట. కింద పేర్కొన్న చిట్కాలు ఆహారాన్ని తినడంలో అంతులేని ఆనందాన్ని అందిస్తాయి.

1. పోషక పదార్థాలు అధికంగా ఉండే వైవిధ్యభరితమైన ఆహార పదార్థాలను తీసుకోండి. ఆ లెక్కన మంచి ఆరోగ్యం కోసం వైవిధ్యమైన 40 రకాల పోషక పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఆహారం కూడా అన్నింటినీ అందించదు. మీ దినసరి ఆహార ఎంపికలో బ్రెడ్ మరియు పప్పు ధాన్య ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల పదార్థాలు, మాంసం, చేప మరియు ప్రోటీన్‌లతో కూడిన ఇతర పదార్థాలు. మీకు ఎన్ని క్యాలరీలు అవసరం అనే దానిని అనుసరించి మీరు ఆహారాన్ని తీసుకోవలసి రావచ్చు.
2. ధాన్యాలు, పండ్లు, పప్పు ధాన్యాలు మరియు కూరగాయలను అధికంగా తీసుకోండి. వీటిని తినడం ఇష్టం లేకపోతే వంట పుస్తకాలలో ప్రస్తావించే కొత్త రకాల వంటకాలను చేసుకుని తినడం ద్వారా వాటిపై ఇష్టాన్ని పెంచుకోండి.
3. ఆరోగ్యకరమైన రీతిలో శరీరం బరువు... మీ శరీరం యొక్క బరువు మీరు స్త్రీలా లేదా పురుషులా?, ఎత్తు, వయస్సు మరియు వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో అదనపు కొవ్వు శాతం, అధిక రక్తపోటు, హృద్రోగం, గుండెపోటు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులకు దోహదం చేస్తుంది. క్రమతప్పకుండా వ్యాయామం చేయడం ద్వార ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండవచ్చు.
4. మితాహారం శ్రేష్ఠం... మితాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాదు ఆహారాన్ని స్వీకరించడంలో సమయపాలన పాటించండి. ఎప్పుడు పడితే అప్పుడు తింటే, ఆశించదాని కన్నా అధిక పరిమాణంలో ఆహారాన్ని స్వీకరించే ప్రమాదముంది.
ఇక విపరీతంగా ఆకలి వేస్తున్నప్పుడు పోషక పదార్ధాలను మాత్రమే తీసుకోవాలన్న సంగతిని మర్చిపోవచ్చు. భోజనాల మధ్య చిరు తిండ్లు తింటే ఆకలి చచ్చిపోతుంది. అందుకే చిరు తిండ్లను భోజనం పరిమాణంలో తీసుకోవడం మంచిది కాదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications