Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
కళ్ళ మంటలు తగ్గాలంటే?

1. మండే మీ కళ్ళను చేతితో నలపకండి. నలిపితే మరింత మండుతాయి. దుమ్ము కణాలు మరింత లోపలికి పోయి సమస్య కలిగిస్తాయి.
2. మీ కండ్లను రోజ్ వాటర్ తో కడగండి. ప్రతిరోజూ రోజ్ వాటర్ తో రెండు నుండి మూడు సార్లు కడిగి కండ్లకు హాయిని కల్పించండి.
3. ఇంటిలో వుండే కీర దోసను చక్రాలుగా తరిగి వాటిని కొద్ది సమయం ఫ్రిజ్ లో వుంచి చల్లని ఆముక్కలను మీ కండ్లపై ఉంచండి. కీర దోసలో మంట తగ్గించే గుణం వుంది. కళ్ళు చాలా హాయిగా భావిస్తాయి.
4. రెండు పచ్చి బంగాళ దుంప గుండ్రటి ముక్కలను కళ్ళపై పెట్టుకోండి. ఇవి కూడా చల్లనివైతే ఫలితం మరింత బాగుంటుంది.
5. మీ కండ్లను ఎపుడూ తాజా నీటితో బయటనుండి వచ్చిన తర్వాత కడగండి. దుమ్ముకణాలు, కాలుష్యం మండే కళ్ళకు కారణాలవుతాయి.
6. ఒక దూది ముక్కను పాలలో ముంచి కండ్ల చుట్టూ తుడవండి. తర్వాత కళ్ళపై దానిని ఉంచండి.
7. కళ్ళు మండేటపుడు కంప్యూటర్, ల్యాప్ టాప్ ఉపయోగించకండి. ఉపయోగించినా, మధ్య మధ్యలో విశ్రాంతినివ్వండి.
8. కాంటాక్ట్ లెన్స్ రెటీనాను పొడి చేస్తాయి. కనుక వాటి ఉపయోగాన్ని తగ్గించి అందమైన కళ్ళజోడు వాడండి. ఇది కంప్యూటర్ నుండి కూడా కళ్ళను రక్షిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications