Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
గ్యాస్ట్రిక్ సమస్యను దూరం చేసే వంటింటి చిట్కాలు

ఎందుకు తయారవుతుంది? మనం తినే ఆహారం. నమలకుండా గబగబా మింగడం. మాట్లాడుతూ తినడం. నోరు ఎక్కువగా తెరచి నమలడం. బీర్, కోలా వంటి కార్బోనేటేడ్ పానీయాలు కూడా గ్యాస్ కి కారణం. అంతే కాదు..స్మోక్ చేయడం. ఆహారనాళంలో జీర్ణం కానీ షుగర్స్ ను కోలన్ లో బాక్టీరియా స్వీకరించి, గ్యాస్ ను విడుదల చేస్తాయి. ప్రేగులలోని కొన్ని బాక్టీరియ గ్యాస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి.
మరి గ్యాస్ రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు: ఆహారాన్ని బాగా నమిలి, నెమ్మదిగా, తక్కువగా తినాలి. ధూమపానం, జర్దా, పాన్ వంటివి తినకూడదు. కొన్ని వ్యయమ పద్ధతులు పాటించాలి. కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు తగ్గించాలి. వేళకి భోజనం చేయాలి. రోజుకు 10-12 గ్లాసుల నీరు త్రాగాలి.
నివారణకు వంటింటి చిట్కాలు:
1. ధనియాలు నమలండి. అది గ్యాస్ ను పోగొడుతుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది.
2. కప్పు మరిగే నీటిలో కొద్దిగా అల్లం, తేనె కలిపి త్రాగండి.
3. తాజా అల్లం ముక్కని నిమ్మరసంలో ముంచి అన్నం తిన్నాక తింటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది.
4. గ్యాస్ రిలీఫ్ కి ఇంగువ బాగా పనిచేస్తుంది.
5. ఒక గ్లాసు మరుగుతున్న నీటిలో పీచ్ ఆకులూ వేసి 10-15 నిమిషాల తర్వాత త్రాగాలి. రోజుకు మూడు సార్లు చేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
6. అరచెంచా వాముపొడి, చెంచా యాలకుల పొడి, ఒక చెంచా మిరియాల పొడి, శొంఠి పొడి చెంచా కలిపి ఉంచుకోవాలి. రోజుకు రెండు సార్లు 400మి.లీ నీటితో తీసుకుంటే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తగ్గుతాయి.
7. తులసి ఆకులు నిమితే కడుపులో గ్యాస్ ఏర్పడదు.
8. మిరియం,శొంఠి, ఏలకులు ఒక్కొక్క్ టీ స్పూన్ చొప్పన తీసుకుని పొడి చేసి అరస్పూన్ నీటిలో కలిపి భోజనం తరువాత అరగంట ఆగి త్రాగాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications