Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
షుగర్ తినటం హాని కలిగిస్తుందా?

మీరు తినే ఆహారాన్ని బట్టే మీ ఆలోచన మరియు ప్రవర్తన ఉంటాయి. స్వీట్ తింటే తియ్యగా మాట్లాడతారనే పాత సామెత మీ మైండ్ నుండి తొలగించండి. శాస్త్రీయ పరిశోధనలు షుగర్ అధికంగా తింటే, బుద్ధి మాంద్యం వస్తుందని నిరూపించాయి. మరి మనం రోజూ తియ్యగా తినే షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? అది తింటే, బుద్ధి మాంద్యం ఎలా వస్తుంది? అనేది పరిశీలిద్దాం.
సినాప్టిక్ స్పందన - సినాప్స్ అనేది బ్రెయిన్ లో ఒక భాగం ఈ భాగంనుండి స్పందనలు బయటకు వదలబడతాయి. మీరు షుగర్ అధికంగా తింటే, తినే షుగర్ లోని ఫ్రక్టోస్ ఈ భాగాన్ని నష్టపరుస్తుందని సైంటిస్టులు చెపుతున్నారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కల ఆహారం తింటే, దానిలోని కొన్ని పదార్ధాలు షుగర్ అధికంగా తిన్నపుడు ఏర్పడే మంద బుద్ధిని తొలగిస్తాయి. ఈ ఫ్యాటీ యాసిడ్లు బ్రెయిన్ లోని సినాప్టిక్ బాగా పనిచేసేలా చేస్తాయి.అంతేకాదు, బ్రెయిన్ కణాలలో నష్టాన్ని రిపేరు చేసి నివారిస్తాయి. మన శరీరం ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు తగినంత తయారు చేసుకోలేదు కనుక అవి వుండే ఆహారం తినటం అత్యంత ప్రధానం అని రీసెర్చర్లు గోమెజ్ పినిలా మరియు రాహుల్ అగర్వాల్ లు వెల్లడించారు.
జ్ఞాపక శక్తి - షుగర్ అధికంగా తినేటపుడు మనలో ఏర్పడే ఫ్రక్టోస్, మనలోని నేర్చుకునే అలవాటు కలిగించే కణాలకు, జ్ఞాపక శక్తి కణాలకు మధ్యగల అనుసంధానాన్ని తొలగిస్తుంది. దానితో బ్రెయిన్ కణాలు ఒకదానితో ఒకటి సంబంధం కోల్పోతాయి. అవి ఒకదానికొకటి సంకేతాలను ఇచ్చుకోలేవు. షుగర్ మన ఆలోచనా శక్తిని స్పష్టంగా లేకుండా చేస్తుంది. దానితో వ్యక్తిలోని తెలివితేటలు తగ్గి అంశాలను సరిగా గుర్తించలేడు.సమగ్రంగా ఆలోచన కలిగి వుండలేడు. కనుక, మీకు తీపి తినాలనే కోరిక అధికంగా వుంటే దానిని తక్షణమే వదిలేయండి.
ఇన్సులిన్ - ఇన్సులిన్ హార్మోన్ మన శరీరాలలో బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తుంది. షుగర్ అధికంగా తినేవారిలో బ్రెయిన్ సెల్స్ ను ప్రభావితం చేసే పవర్ అది కోల్పోతుంది. ఫ్రక్టోస్ అధికంగా వుండే ఆహారం తీసుకుంటే, బ్రెయిన్ మరియు శరీరం రెండూ నష్టపోతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కల ఆహారంఅయిన టోఫు, సోయాబీన్స్, రొయ్యలు, వాల్ నట్ లు వంటివి మాత్రమే ఈ నష్టాన్ని నివారించగలవు.
కనుక షుగర్ లేదా ఫ్రక్టోస్ అధికంగా ఆహారంలో తీసుకునేవారు షుగర్ ప్రభావాన్ని తగ్గించాలంటే, తాజా బెర్రీలు లేదా ఇతర పండ్లు తినాలి. లేదా స్వీట్ తిన్నందువల కలిగే నష్టాన్ని భర్తీ చేయటానికి అవసరమైన మందులు వేసుకోవాలి. అయితే ఈ మందులు వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోండి.
అన్నిటికి మించి షుగర్ వినియోగాన్ని ఎంత బాగా తగ్గిస్తే అంత మంచిదని మన తెలివి తేటల్ని కాపాడుకోవచ్చని భావించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications