Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
బరువు తగ్గించే సహజ పానీయాలు!

బరువు తగ్గించే సహజ పానీయాలు
సొరకాయ రసం - సొరకాయ రసంలో నీరు, పీచు పుష్కలంగా వుంటాయి. 100 గ్రాముల రసంలో 12 కేలరీల శక్తి వుంటుంది. ప్రతిరోజూ మీ బ్రేక్ ఫాస్ట్ లో ఒక్క గ్లాసెడు సొర రసం చేర్చండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలివ్వటమే కాక, మీ చర్మానికి కాంతి కూడా ఇస్తుంది. మన ఆకలిని మందగించి అధిక ఆహారం తీసుకోకుండా చేస్తుంది కనుక బరువు తగ్గేందుకు సొర రసం బాగా పనిచేస్తుంది.
పుచ్చ పండు రసం - పుచ్చకాయలో విటమిన్లు, మినరల్స్ అధికం. 100 గ్రాముల రసంలో 30 కేలరీల శక్తి వుంటుంది. జాతీయ వాటర్ మెలన్ ప్రమోషన్ బోర్డు ప్రతినిధి సామంత మేరకు వాటర్ మెలన్ లేదా పుచ్చకాయలో అన్నిరకాల విటమిన్లు వుంటాయి. గుండె ఆరోగ్యానికి పుచ్చకాయ ఎంతో మేలని అమెరికనన్ హార్ట్ అసోసియేషన్ తన జాబితాలో చేర్చింది.
ఆరెంజ్ జ్యూస్ - తక్కువ కేలరీలు, అధిక పోషకాలు కల ఈ పానీయం బరువు తగ్గేందుకు బాగా పనిచేస్తుంది. 100 గ్రాముల జ్యూస్ లో 47 కేలరీల శక్తి వుంటుంది. శరీరానికి విటమిన్ సి అందించి కడుపు నింపుతుంది. సిట్రస్ జాతి పండ్లు శరీరంలో అధిక కొవ్వు కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి.
కేరట్ జ్యూస్ - కేరట్ జ్యూస్ లో కేలరీలు తక్కువ. చాలామంది డైటర్లు ప్రతి రోజూ బరువు తగ్గేందుకు తమ చర్మ కాంతికి ఈ పానీయం తాగుతారు. 100 గ్రాముల రసంలో 41 కేలరీల శక్తి వుంటుంది. బాగా కడుపు నింపేస్తుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరియు ప్రివెన్షన్ సంస్ధ లోని సైంటిస్టులు ప్రతిరోజూ ఒక గ్లాసు కేరట్ రసం తాగితే రోగ నిరోధకతను బలపరుస్తుందని తెలుపుతారు.
ద్రాక్ష రసం - ఇది మరొక బరువు తగ్గించే పానీయం. సిట్రస్ జాతికి చెందినదే. యాంటీ ఆక్సిడెంట్లు అధికం. శరీర కొవ్వును తేలికగా కరిగిస్తుంది. వంద గ్రాముల రసంలో 69 కేలరీల శక్తి వుంటుంది. మలబద్ధకం పోవాలంటే ద్రాక్షరసం తాగాలి. అజీర్ణం, అలసట, కిడ్నీ సమస్యలు, తలనొప్పి, మహిళలలో రుతుక్రమ సమస్యలకు, గుండె జబ్బులు, ఆస్తమా వ్యాధులకు ద్రాక్షరసం తాగటం మంచి పరిష్కారం.
బరువు తగ్గించే ఈ పానీయాలు, ఆరోగ్యం మరియు త్వరగా జీర్ణం అవుతాయి. కనుక చల్లని తక్కువ కేలరీలు కల ఈ పండ్లు, కూరల రసాలను తాగి ఇంటివద్దే మీ బరువు తగ్గే ప్రణాళిక ఆచరించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
