Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి..నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం...
ఆడపిల్లల్లో 21 ఏళ్లదాకా శారీరక ఎదుగుదల కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఎత్తు, బరువు, శరీరఛాయ, శరీరాకృతి అనేవి జన్యుపరంగా నిర్ధారించబడి ఉంటాయి. కొంత మందికి నెలసరికీ నెలసరికీ మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి సమయంలో గానీ లేదా అంతకు ముందు గానీ తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది.
కొంతమందిలో నెలసరి ఈ నొప్పి మరింత తీవ్రదశలో ఉంటుంది.ఋతువు ప్రారంభానికి ఒక రోజు ముందు పొత్తికడుపులో కండరాలు ఎవరో గట్టిగా పట్టుకుని సలుపుతు ఉన్నట్లుగా మొదలై అది ఋతు సమయంలో మరింత ఎక్కువగా ఏర్పడుతుంది. దీనితో పాటే కడుపులో వికారం, సొమ్మసిల్లిపోవడం వంటి లక్షణాలు ఏర్సడుతాయి.
ఇవి ఎపుడైతే ఏర్పడుతాయో అపుడే మీరు ఈ నొప్పి చాలాతీవ్రంగావుంది అని గ్రహించాలి. వెంటనే తగు చికిత్స కోసం వైద్యులను సంప్రదించాలి. వైద్యులు ప్రొస్టోగ్లాండిన్ విడుదలను ఆఫే మందులను ఇస్తారు. కాగా వివాహిత స్త్రీలు, ఒక వేళ గర్భనిరోధక మాత్రలు వాడుతూ వున్నట్లయితే, నొప్పిఏర్పడే అవకాశం ఉండుదు.

ఎందుకంటే గర్భనిరోధక మాత్రలు సహజంగానే అండోత్పత్తిని నిరోధిస్తాయి. కాబట్టి అండాలు ఉత్పత్తి కావు. ఆ కారణంగా ఏర్పడే నొప్పి ఉండదు. అయితే ఇలా గర్భనిరోధక మాత్రలు వాడడం టీనేజ్ లో మంచిదికాదు. నొప్పికి భయపడో, లేక ఇతర ప్రయోజనాల కోసమో గర్భనిరోధక మాత్రలు ఉపయోగించడం వల్ల టీనేజ్ లో బాలికలు ఎదుగుదల తగ్గి, నీరసంగా అవుతారు.
కాగా సమస్యలు ఏర్పడితే, మీరు ఒక న్యూరాలజిస్టు (నరాల వైద్యుడిని)ను కలుసుకునే తీరాలి. ఎందుకంటే ఋతుసమయంలో భరించ రాని నొప్పి కలగటానికి, నరాల సమస్య కూడా ఒక కారణం ఏది ఏమైనప్పటికీ ఋతుక్రమంలో వచ్చే నొప్పిని అలక్ష్యం చేయకూడదు. తేలికపాటి నొప్పి అయితే ఖంగారు పడనవసరం లేదు.
అంతే కాదు తినే ఆహారంలో కూడా కొద్ది పాటి మార్పు చేసుకొంటే ఆ నొప్పి కంట్రోల్ చేసుకోవచ్చు. నెలసరిలో తరచూ నొప్పితో బాధ పడేవారు ఓమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కలిగినటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఓమేగా ఫ్యాటీ ఆసిడ్ సాల్మాన్, మెకరేల్ వంటి చేపల్లో ఎక్కువగా ఉంటుంది. ఫిష్ ఆయిల్, తర్వాత మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాలను ప్రతి రోజూ మీ ఆహారంలో ఉండేట్లు చూసుతకోవాలి.
వీటితో పాటు ఆక్యూప్రెజర్: ఇది ఒక మసాజ్ థెరపీ. దీనిని ఉపయోగించి కొంత వరకూ ఉపశమనం పొందవచ్చు...
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications