Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
మెదడును క్షీణింపజేసే రోజువారీ అలవాట్లు?

1. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవటం
ఉదయంవేళ పనుల ఒత్తిడిలో అల్పాహారం తీసుకోవడం మానివేస్తూ వుంటాం. బ్రేక్ ఫాస్ట్ చేయనివారిలో బ్లడ్ షుగర్ స్ధాయి తక్కువగా వుంటుంది. ఇది బ్రెయిన్ కు అవసరమైన పోషకాలను తగినంతగా సరఫరా చేయలేదు. దానితో బ్రెయిన్ క్షీణించటం మొదలుపెడుతుంది.
2. అధికంగా తినడం
చాలాసార్లు, మనకు ఇష్టమనే ఆహారం లభించినా, లేక అలవాటుగాను లేక టి.వి.లవంటివి చూస్తూ ఆహారాన్ని అధికంగా తినేస్తాం. ఈ చర్య బ్రెయిన్ లోని రక్తనాళాలను గట్టిపడేస్తుంది. దానితో మీ మానసిక పటుత్వం తగ్గుతుంది.
3. పొగతాగటం
సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు పదార్ధాల సేవనం మెదడు పొరలను సంకోచింపచేస్తుంది. చివరకు ఆ సమస్య అల్జీమర్ వ్యాధికి కూడా చేరే ప్రమాదం వుంది.
4. అధిక షుగర్ తినటం
షుగర్ అధికం అయితే అది ప్రొటీన్స్, ఇతర పోషకాలను పీల్చకుండా చేస్తుంది. ఈ రకమైన పోషకలేమి బ్రెయిన్ అభివృధ్ధిని కుంటుపడేస్తుంది.
5. వాయు కాలుష్యం
మన శరీరంలో బ్రెయిన్ అధిక ఆక్సిజన్ తీసుకునే అవయవం. కలుషిత గాలిని పీలిస్తే బ్రెయిన్ కు ఆక్సిజన్ సరఫరా తగ్గటం బ్రెయిన్ సామర్ధ్యం తక్కువవడం జరుగుతుంది.
6. నిద్ర లేమి
నిద్ర మన బ్రెనయిన్ కు విశ్రాంతి నిస్తుంది. ఎక్కువ సమయం కనుక నిద్రలేమి తో గడిపితే అది మెదడు కణాలు చితికిపోయేలా చేస్తుంది.
7. తలకు కప్పుకోవడం
నిద్రించే సమయంలో కనుక తలనిండా ముసుగుపెట్టి పడుకుంటే, పీల్చే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ అధికమై బ్రెయిన్ కణాలు దెబ్బతింటాయి.
8. జబ్బులో పని చేయటం
జబ్బులు పడ్డపుడు చదవటం, లేదా పని చేయడం వంటివి బ్రెయిన్ సామర్ధ్యాన్ని తగ్గించి నష్టపరుస్తాయి.
9. తెలివిగా ఆలోచించకపోవటం
బ్రెయిన్ కు ఆలోచన శిక్షణ వంటిది. ఆలోచనలను చేయకుంటే అది బ్రెయిన్ కుచించుకుపోవటానికి అవకాశమిస్తుంది.
10. అరుదుగా మాట్లాడటం
మేధావులతో సంభాషణలు బ్రెయిన్ ను వికసింపజేస్తాయి. సంభాషణలు కొనసాగించకపోతే బ్రెయిన్ పదునెక్కదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications