Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
పైకి కనపడే ఫేషన్...లోపలి భాగాల డేమేజ్!

హై హీల్స్ - సాధారణంగా మహిళలు హై హీల్స్ వేస్తుంటారు. హై హీల్స్ కారణంగా వెన్ను కింది భాగం నొప్పి వస్తుంది. బిగువుగా వుండే జీన్స్ వేస్తారు. వీటి కారణంగా గుండెకు రక్తప్రసరణ సమస్య వస్తుంది.
గుండెలో మంటగా వుంటే, మీరు తినే ఆహారం మాత్రమే కాదు, మీ నడుముకు కట్టిన దుస్తులు ఎంత బిగువున్నాయనేది కూడా పరిశీలించండి. బిగువైన పేంట్లు, లేదా జీన్స్ వంటివి గుండెమంట కలిగిస్తాయి. మీలోని యాసిడ్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. కనుక జాగ్రత్తగా వుండాలంటారు విషయ నిపుణులు.
బిగువుగా వుండే దుస్తులు - లోదుస్తులు లేదా దుస్తులు బిగువైనవి ధరిస్తే, ఒత్తిడి అధికమవుతుంది. గుండెమంట, గాలి ఆడకపోవటం, ఆందోళనతో గుండె సమస్యలు కలుగుతాయి. పొట్టను నియంత్రించే మెషీన్లు, పిరుదుల ఆకారాన్ని మార్చే మెషీన్లు ఎన్నో వస్తున్నాయి. ఇవి దీర్ఘకాలం ఉపయోగిస్తే మీ పొట్ట మరియు మూత్రాశయ ప్రాంతాలలో సమస్యలొస్తాయి. కండరాలు బలహీనపడతాయి. కొద్దిపాటి ఒత్తిడి తగిలితే చాలు, మూత్రం వచ్చేస్తుంది.
అది ఊపిరితిత్తులను వత్తుతుంది. అధికంగా ఉపయోగిస్తే రక్తంలో ఆక్సిజన్ తగ్గి చెమటలు పడతాయి. వెంటనే గ్రహించలేకుంటే, గుండెపోటు వస్తుంది. భోజనం చేసేటపుడు, లేదా తర్వాత పొట్ట కిందిభాగం ఒత్తబడి యాసిడ్లు ఆహార గొట్టంలోనుండి పైకి వచ్చి గుండె మంట కలిగించే ప్రమాదం వుంది. మలవిసర్జన సమస్యలు కలుగుతాయి.
పురుషులలో బిగువుగా ధరించే లంగోటీలు, గోచీలు, లేదా అండర్ వేర్లు వంటివి పుండ్లు, ఫంగస్ కలిగేలా చేస్తాయి. వీర్యకణాల ఉత్పత్తి తగ్గి సంతానోత్పత్తీ కరణ తగ్గుతుంది. కనుక లోదుస్తులు ధరించేటపుడు వాటి ఎలాస్టిక్ బిగువుగా లేకుండా జాగ్రత్తపడండి. గుడ్డ సాధారణమైందిగా వుండాలి.
సింధటిక్ గుడ్డలు లోదుస్తులుగా వాడితే, శరీర భాగాలకు గాలి ఆడక ఇన్ఫెక్షన్ వస్తుంది. చర్మం మంట పెడుతుంది. అది మూత్రాశయం వరకు సమస్యలనిస్తుంది.
టైట్ గా వుండే జీనన్స్ వేస్తే కాలి, చేతి, వేళ్ళ నరాలకు నొప్పులు, గుండె మంట, హెర్నియా వస్తాయి. నడుమువద్ద బిగువు, కాలి లేదా చేతుల వేళ్ళ వరకు ప్రభావించి నొప్పులు పెడుతుంది. చురుక్కుమంటూ మంటలు, తిమ్మిరి కలుగుతుంది. గాలిలో తేమ అధికంగా వుండే ప్రదేశాలలో టైట్ జీన్స్ వేస్తే అవి వెచ్చగా వుండి ఫంగస్ చేరుతుంది. చర్మ వ్యాధులు, మూత్రాశయ వ్యాధులు కలుగుతాయి. టైట్ గా వేసే పేంట్ల కారణంగా హెర్నియా వచ్చే అవకాశం వుంది. దగ్గినా, నవ్వినా, లేదా తుమ్మినా అది హెర్నియా లిగిస్తుంది. పేంట్లు సాధారణంగా పిరుదులపైన, పొట్టకు ఒత్తిడి లేకుండా కూర్చోవాలి.
షర్టు కాలర్లు, టై లు బిగువుగా కట్టడం వలన గ్లూకోమా, కళ్ళు తిరగటం, తలనొప్పి, భుజం నొప్పి, వస్తాయి. ఫలితంగా, తొలనొప్పి, కనుచూపు మందగించటం, సెర్వికల్ స్పాండీలోసిస్, అరుదుగా గుడ్డితనం కూడా కలుగుతుంది. కంటి గుడ్డుపై అధిక ఒత్తిడి పడితే, గ్లూకోమా వస్తుంది. గ్లూకోమా వంశానుగతంగా కూడా రావచ్చు. కనుక
చాలామంది ఫేషన్ పేరుతో నేరో షూస్ వేస్తారు. దీని కారణంగా పాదాలకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. పాదాలు దుర్వాసన, పుండ్లు పడటం జరుగుతుంది. వీటిని అధిక కాలం వాడితే, పాదాల ఆకారం కూడా మారిపోతుంది. గ్రంధులు, నరాలపై ఏ రకమైన ఒత్తిడి కలిగినా దాని ప్రభావం రక్తప్రసరణపై పడుతుంది. అనారోగ్యాలను కలిగిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications