Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గాఢ నిద్ర పెంచే సంతోషకర ఆలోచనలు!

గాఢ నిద్రపై చేసిన ఒక స్టడీలో రీసెర్చర్లు 70 మంది వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపును రాత్రంతా గాఢంగా నిద్రింపజేసి మరొక గ్రూపును రాత్రంతా మెళకువగా వుండాల్సిందిగా కోరారు. ఈ రెండు గ్రూపుల వ్యక్తులను మరుసటి రోజు కొన్ని పాజిటివ్ చిత్రాలు అంటే కుక్కపిల్లలు, పూవులు వంటి వాటిని, ఫర్నిచర్, మరియు డైనింగ్ ప్లేటులు వంటి వాటిని చూడవలసినదిగా కోరారు.
ఈ రకంగా చూసిన వారి మెమొరీల చిత్రాలను షుమారు పన్నెండు గంటల తర్వాత పరీక్షించారు. నిద్రించిన వారి మైండ్ లోని చిత్రాల జ్ఞాపకాలు ఎంతో బలంగా ముద్రవేసినట్లు నిద్ర లేని వారి మెమొరీ చాలా బలహీనంగా వున్నట్లు కనుగొన్నారు. రీసెర్చి ఫలితాలు, నిద్ర మన మానసిక పాజిటివ్ మెమొరీలను మెరుగు పరుస్తుందని తెలుపుతున్నట్లు రీసెర్చి నిర్వహించిన మస్సాచుటీస్ యూనివర్శిటీ ప్రొఫెసర్ రెబెకా స్పెన్సర్ వెల్లడించారు.
అంతేకాదు ఈ ఫలితాలు, మానసిక వ్యాధులు, ఒత్తిడి తగ్గించే చికిత్సా విధానంలో కూడా సహకరిస్తాయని అధ్యయనకారులు భావిస్తున్నారు. రాత్రి నిద్ర అందరకు ఎంతో అవసరం. ప్రతి ఒక్కరూ రాత్రివేళ కనీసం ఆరు నుండి ఏడు గంటలపాటు తప్పక నిద్రించాలని, దాని ప్రభావం మరుసటిరోజు దైనందిన కార్యక్రమాలపై పడి ప్రతి ఒక్కరూ చేసే పనిపై ప్రభావం చూపుతుందని వీరు వెల్లడి చేసినట్లు ది డెయిలీ మెయిల్ ప్రచురించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications