Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఏమిటి ఈ..... ఎనిమిది గంటల నిద్ర కల్పితమా?

సైంటిస్టులు ఈ నిద్రా పద్ధతికి తృప్తి చెంది ఈ రకమైన నిద్ర సరిపోతుందని భావించినప్పటికి మనం మాత్రం ఇంకా వరుసగా 8 గంటల నిద్ర వుండాలని భావిస్తూనే వున్నాం. 2001 లో మరో సైంటిస్టు 16 సంవత్సరాలు నిద్రపై పరిశోధన చేసి మానవులు రెండు సార్లుగా నిద్రిస్తారని వెల్లడించాడు. ఈ రకంగా రెండు మార్లుగా నిద్రించవచ్చనే దానిపై షుమారుగా 500 రుజువులు దొరుకుతున్నాయి. అమ్మాయి తన భర్తను అర్ధరాత్రి అవసరానికి లేపేసినప్పటికి అతను మళ్ళీ హాయిగా రెండోమారు నిద్రించాడనే సంఘటన 1595 సంవత్సరంలోనే రికార్డయిందట. చీకటిపడిన రెండు మూడు గంటలకు నిద్రించటం, మధ్యలో లేవటం రాత్రి పని చేసుకుని మరల రెండోమారు నిద్రించడం వంటివి పురాతనకాలంగా చరిత్రలో ఎన్నో నిదర్శనాలు కనపడుతున్నాయి. ఇలా మధ్యలో నిద్ర లేచినవారు మరింత ఉత్సాహంగా ఆ సమయంలో వుంటున్నారట. టాయ్ లెట్ కు వెళ్ళడం, ఒక సిగరెట్ కాల్చేయడం ఆపై భార్య పని చూడటం, వీలైతే పొరుగువారికి హల్లో అనడం కూడా చేస్తారట. అయితే చాలామంది, బెడ్ వదలకనే చదవటం, వ్రాయటం అపుడపుడూ దేముడిని ప్రార్ధించటం కూడా చేస్తారు.
ఇలా రాత్రి మధ్యలో నిద్ర లేచి దేముడికి ప్రార్ధన చేసి మరల పడుకోవడం అనేది 15వ శతాబ్దం నుండి కూడా జరుగుతున్నట్లు చరిత్ర సాక్షాలున్నాయట. మరి తరచుగా పక్కనపడుకున్న భార్యతో రతి క్రీడలు నిరాటంకంగా సాగించేయటం కూడాను. 16 వ శతాబ్దంలో ఒక డాక్టర్, పిల్లలు పుట్టాలంటే, రాత్రివేళ ఒక సారి నిద్రపోయి లేచి భార్యతో రతి సాగిస్తే త్వరగా పుడతారని వారికి మరింత ఆనందంగా వుంటుందని వైద్య సలహా కూడా ఇచ్చేవాడట. అయితే 17వ శతాబ్దం వచ్చేసరికి ఈ రెండుమార్ల రాత్రి నిద్ర అలవాటు మాయమైంది. ఉత్తర ఐరోపాలోని ధనవంతులు తర్వాతి 200 సంవత్సరాల పాటు ఏకధాటీగా రాత్రులందు నిద్రించేయటం అదే అలవాటును పాశ్చాత్యులకు అప్పగించటం జరగటంతో ఇపుడ మనమంతా ఎనిమిది గంటల నిద్ర కావాలని గాఢంగా నమ్మేస్తున్నాం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications