Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
తలనొప్పి రాకుండా చిట్కాలు!

అకస్మాత్తుగా తలనొప్పి వచ్చేస్తే, తలనొప్పి వచ్చిన కారణం కూడా కొన్నిసార్లు మనకు తెలియదు. రోజూ తాగే టీ లేదా కాఫీ వంటివి మిస్ చేసినా తలనొప్పి వచ్చే అవకాశం వుండదు. దంతాలు కొరకటం లేదా పెదవులు బిగపట్టటం వంటివాటికి రావచ్చు. మరి అకస్మాత్ గా వచ్చే ఈ తలనొప్పిని నివారించటమెలా?
మీరు ఏదైనా నములుతూంటే తప్ప లేదా తింటూ వుంటే తప్ప మీ దంతాలను కొరకవద్దు. ఒక ఆవు నెమరు వేసే రీతిలో మీరు మీ నోటిని ఎల్లపుడూ కదపవలసిన పనిలేదు. దంతాలు ఒకదానికి మరొకటి కిందవి పైవి తగలకుండా మీ పెదవులను మూసి వుంచండి. మీ నోటిని గుండ్రంగా తిప్పండి. నోరు బాగా అనేక సార్లు తెరవండి. కొన్ని సార్లు మీకు ఎముకలు విరిగిన ధ్వని వస్తుంది. ఖంగారు పడకండి. అది సాధారణమే. మొదటిలో కొంచెం కష్టంగా వున్నా ఆందోళన చెందకండి. ఈ శబ్దాలు, నొప్పులూ క్రమేణా సర్దుకుంటాయి.
ఎపుడూ కనుబొమ్మలు ముడిచే అలవాటు ఉందా? అది మానండి. బహుశ ఈ కారణంగా కూడా మీకు తలనొప్పి వచ్చే అవకాశం వుంది.
నొప్పి వున్న ఆ ప్రదేశాలను మసాజ్ చేయండి. నొప్పి తగ్గిందేమో చూడండి. టెన్షన్ కలిగించే కండరాన్ని రిలాక్స్ చేయండి. శాశ్వతంగా రిలీఫ్ వచ్చేలా ప్రయత్నించండి.
వ్యాయామం చేయండి. వ్యాయామానికి మించినది లేదు. సాధారణ ఆరోగ్య సమస్యలు వ్యాయామంతో సరిదిద్దవచ్చు. వ్యాయామం మంచి ఔషధంగా పనిచేస్తుంది. మీ తలనొప్పులు, మీరు క్రమం తప్పకుండా చేస్తూంటే చాలు మటుమాయమవుతాయి.
నీరు తాగటం ఎపుడూ మంచిదే. చాలా సార్లు తగిన నీరు తాగటం వలన కూడా తలనొప్పి దూరం చేయవచ్చు. తలనొప్పి శరీర డీహైడ్రేషన్ కారణంగా వస్తుంది. అధిక నీరు తాగినందువలన శరీరంలోని పోషక ద్రవాలు పలుచబడి ఆందోళన కలిగించే అవకాశం వుంది.
ఈ సారి తలనొప్పి వస్తే, ఈ చిట్కాలు పాటించి ఉపశమనం పొందండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications